Kiran Kumar Reddy: కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ..? బీజేపీ నుంచి పోటీ చేస్తారా..? పార్టీకి ఉపయోగం ఉందా..?

టీడీపీతో బీజేపీ పొత్తు దాదాపు ఖాయమని అనుకుంటున్న టైంలో పార్టీ ముఖ్య నేతలు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు..? ఎవరెవరి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయన్న చర్చ ఏపీ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావన కూడా వస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2024 | 02:29 PMLast Updated on: Feb 22, 2024 | 2:29 PM

Kiran Kumar Reddy Will Contest From Ap In Loksabha Elections

Kiran Kumar Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తర్వాత సొంత దుకాణం పెట్టుకున్నారు. ఆ తర్వాత దాన్ని కట్టేసి.. తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిపోయారు. పవర్‌ లేకుండా, దరిదాపుల్లో వస్తామన్న గ్యారంటీ కూడా లేకుండా ఆ పార్టీలో ఎన్నాళ్ళని పడి ఉంటామనుకున్నారో ఏమో.. చివరికి కాషాయ కండువా కప్పుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తారని, అలాగే ఆయనకున్న పరిచయాలని వాడేసి కర్ణాటకలో సైతం కమలాన్ని గట్టెక్కిస్తారని ఓ రేంజ్‌లో ఎలివేషన్స్‌ వచ్చాయి అప్పుడు.

Mudragada Padmanabham: అందుకే వదిలేశారు! ముద్రగడా నీకో దణ్ణం ! కాపు నేతని వదిలేసిన పార్టీలు..

రెండు రాష్ట్రాలను రెండు భుజాల మీద మోసుకుని పవర్‌ కిరణాలను ప్రసరింప చేస్తారంటూ.. అబ్బో.. అప్పట్లో ఓ రేంజ్‌లో బిల్డప్‌లు ఇచ్చారు ఆయన మద్దతుదారులు. కానీ.. రెండు చోట్లా పార్టీ చతికిలపడిపోయింది. తెలంగాణలో అయితే.. కనీసం డబుల్‌ డిజిట్‌ అసెంబ్లీ సీట్లు కూడా రాలేదు. అక్కడెక్కడా అక్కరకు రాలేకపోయిన కిరణం సార్‌.. ఆ తర్వాత తన ఫోకస్‌ని ఏపీ పాలిటిక్స్‌ మీదికి మళ్ళించారట. ఏపీ బీజేపీ నిర్వహించే ప్రతి కీలక సమావేశాల్లోనూ పాల్గొంటున్నారాయన. టీడీపీతో బీజేపీ పొత్తు దాదాపు ఖాయమని అనుకుంటున్న టైంలో పార్టీ ముఖ్య నేతలు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు..? ఎవరెవరి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయన్న చర్చ ఏపీ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావన కూడా వస్తోంది. పక్క రాష్ట్రాల్లో ఏదో పొడిచేస్తారనుకుంటే పార్టీని పడుకోబెట్టారనీ.. ఇప్పుడు ఏపీలో ఆయన రోల్‌ ఏంటన్న మాటలు ఆంధ్రా కాషాయ దళంలోనే వినిపిస్తున్నాయట. సొంత రాష్ట్రం కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా..? ఒకవేళ చేస్తే ఎక్కడి నుంచి అన్న చర్చ కూడా జరుగుతోందట. ప్రస్తుతం బీజేపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయాలని డిసైడ్ అయితే.. రాజంపేట లోక్‌సభ సీటును ఎంచుకునే అవకాశం ఉందంటున్నారు.

Ganta Srinivasa Rao: అదే కావాలి ! గంటా పార్టీ మారతారా ? ఆ మాటలకు అర్థం ఏంటి ?

ఆయన సొంత అసెంబ్లీ సెగ్మెంట్‌ పీలేరు.. రాజంపేట పార్లమెంట్ పరిధిలోనే ఉంది. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేయవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇదే సందర్భంలో మరో వాదన కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ముందు రాజంపేట నుంచి అనుకున్నా.. ఆ తర్వాత సొంతగా సర్వే చేయించుకుంటే ఫీడ్‌ బ్యాక్‌ తేడాగా వచ్చిందని, అందుకే ఆ ప్రతిపాదనకు పాజ్‌ ఇచ్చినట్టు మరో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మాజీ సీఎం తీరు మీద పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి లీడర్ బీజేపీలోకి రావడం వల్ల పార్టీకి ఎంత మాత్రమూ ఉపయోగం లేదన్నది లేటెస్ట్‌ వాయిస్‌. పార్టీలో చేరింది మొదలు ఆఫీస్‌లోనో, వేరే ప్రాంతాల్లో ఎక్కడైనా సమావేశాలు జరిగితే అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత అట్నుంచి అటే హైదరాబాద్ చెక్కేయడం మినహా.. పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని అంటున్నాయి ఏపీ కమలం వర్గాలు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా వ్యవహరించిన నేత. పైగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ముఖ్య నాయకుడు. ఆ ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తే.. కాస్తో కూస్తో పార్టీతో పాటు వ్యక్తిగతంగా ఆయనకు కూడా ఉపయోగంగా ఉండేదనీ.. ఆ పని చేయకపోవడం వల్ల రెండు విధాలా చేటయిందన్నది ఏపీ కాషాయ దళంలో ఉన్న విస్తృత అభిప్రాయం.

బీజేపీ లాంటి అతి పెద్ద వేదిక అందుబాటులో ఉన్నా.. దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం ఉన్నా.. కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని సద్వినియోగం చేసుకోలేక కిందా మీదా పడుతున్నారన్న మాట గట్టిగానే వినపడుతోంది. కేంద్రంలో పవరున్న పార్టీలో కీలక నేతగా ఉండి.. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఎంత వరకు కరెక్ట్ అనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఆయన రోల్‌ ఎలా ఉండబోతోందన్న సబ్జెక్ట్ ఆసక్తికరంగా మారింది.