Spl story: కిరణ్ రాయల్ సస్పెండ్.. పవన్ వద్దకు చేరిన లేడి రచ్చ
తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్.. కిరణ్ రాయల్ మోసం చేశాడని లక్ష్మీ అనే మహిళ ఓ వీడియో విడుదల చేసింది. కోటి 20 లక్షల అప్పు తీసుకుని కిరణ్ రాయల్ తన మోసం చేశాడని తన జీవితంలో నమ్మించి మోసపోయానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో బయట పెట్టింది.

తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్.. కిరణ్ రాయల్ మోసం చేశాడని లక్ష్మీ అనే మహిళ ఓ వీడియో విడుదల చేసింది. కోటి 20 లక్షల అప్పు తీసుకుని కిరణ్ రాయల్ తన మోసం చేశాడని తన జీవితంలో నమ్మించి మోసపోయానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో బయట పెట్టింది. అప్పుచేసి అలాగే నగలు తాకట్టు పెట్టి ఇచ్చానని, అప్పు తీర్చమని అడిగితే నా పిల్లల్ని చంపుతామని బెదిరిస్తున్నాడని ఆమె వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. తనను భయపెట్టి బెదిరించి వీడియో తీసుకున్నారని ,తనకు అప్పులు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని, తనకు చావే శరణ్యం అని, ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆమె వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేసింది.
అయితే గతంలో ఆమె విడుదల చేసిన ఓ వీడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. గతంలో ఇచ్చిన డబ్బులు మొత్తం కిరణ్ రాయల్ తనకి ఇచ్చేసాడంటూ ఏడాది క్రితం ఇదే మహిళ ఒక వీడియో రిలీజ్ చేసింది. మొత్తం డబ్బులను కిరణ్ రాయల్ తనకి ఇచ్చేసాడని.. అతనికి తనకు ఎటువంటి లావాదేవీలు లేవని ఆమె ఆ వీడియోలో వివరించింది. ఇక మహిళా ఆరోపణలతో రంగంలోకి దిగిన కిరణ్ రాయల్.. డబ్బులు సెటిల్ చేస్తున్నప్పుడు తీసిన వీడియోలను బయటపెట్టాడు. ఆడదాన్ని అడ్డం పెట్టుకొని తిరుపతి వైసీపీ నేతలు చేస్తున్న కుట్రగా కిరణ్ రాయల్ ఆరోపణలు చేస్తున్నాడు.
ఇక మీడియాతో మాట్లాడుతూ లక్ష్మి ఖిలాడీ లేడి అని ఆమెపై జైపూర్ అలాగే వైజాగ్, బెంగళూరులో కేసులు ఉన్నాయని ఆరోపించాడు. బెట్టింగ్ తో పాటుగా రకరకాల వ్యసనాలతో ఆమె అప్పుల పాలు అయిందని ఆ కారణంగానే లక్ష్మీని తిరుచానూరు పోలీసులు అరెస్టు చేస్తే తను విడిపించానని.. చెప్పుకొచ్చాడు. ఇక లక్ష్మీ వీడియో విడుదల చేసిన తర్వాత కిరణ్ రాయల్ ఆమెకు ఫోన్ చేసి.. చంపేస్తానని ఆ తర్వాత నెలలో బయటకు వస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా బూతులు కూడా తిట్టాడు కిరణ్ రాయల్. ఆ వాయిస్ రికార్డును లక్ష్మీ మీడియా ముందు వినిపించారు.
తిరుపతి మండలం చిగురువాడకు చెందిన లక్ష్మీ ప్రస్తుతం తిరుపతి ఎంఆర్ పల్లిలో నివాసం ఉంటుంది. చిగురువాడలో ఉండే సమయంలో కిరణ్ రాయల్ తన నివాసం పక్కనే వచ్చి చేరాడని లక్ష్మీ ఆరోపణలు చేస్తోంది. తనతో ఉన్న పరిచయం మేరకు డబ్బులు అడిగేవాడని కిరణ్ రాయల్ వాడుతున్న కారు అలాగే ఇంటికి కూడా తాను అప్పులు చేసి కొంత ఎకరం భూమిని మరికొంత డబ్బులిచ్చినట్లు తెలిపింది. మొత్తంగా ఒకటి పాయింట్ రెండు కోట్లు అలాగే 25 సవర్ల బంగారం అతనికి ఇచ్చినట్లు తెలిపింది. తాను డబ్బులు అడిగినప్పుడు.. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే.. డబ్బులను అంతకు రెండింతలు తిరిగిచ్చేస్తానని అతను చెప్పాడని.. ఇక తనకు 30 లక్షలకు బాండ్ పేపర్లు చెక్కులు ఇచ్చినట్లు లక్ష్మి వివరించింది. ఇక ఈ వ్యవహారంతో కిరణ్ రాయల్ ఆత్మ రక్షణలో పడిపోయాడు. ఇక మరికొంతమంది అతన్ని జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్దకు చేరింది. దీనిపై పవన్ కళ్యాణ్ కిరణ్ రాయల్ ను వివరణ అడిగినట్లు సమాచారం.