Kishan Reddy: బీఆర్ఎస్ గూండాల దాడి అమానుషం : కిషన్ రెడ్డి
నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఎన్నికల ప్రచారం కోసం కేసిఆర్ వస్తుండంతో శాంతియుతంగా ధర్నా చేస్తున్న శ్రీధర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారు. అసహనంతో బిజెపి కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు.

Kishan Reddy: నెల్లికల్ లిఫ్ట్ దగ్గర ధర్నా చేస్తున్న నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డిపై.. బీఆర్ఎస్ గుండాలు విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఎన్నికల ప్రచారం కోసం కేసిఆర్ వస్తుండంతో శాంతియుతంగా ధర్నా చేస్తున్న శ్రీధర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారు. అసహనంతో బిజెపి కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు.
సంఘ విద్రోహశక్తులకు వ్యతిరేకంగా పోరాడే చరిత్ర కలిగిన భారతీయ జనతా పార్టీ.. BRS గుండాల దాడులకు భయపడదని అన్నారు కిషన్ రెడ్డి. వైఫల్యాలతో జనం మిమ్మల్ని చెప్పులతో కొడుతుంటే, వారి సమస్యలను పరిష్కరించకుండా.. బీజేపిపై దాడులకు పాల్పడడం సిగ్గుచేటని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే బీఆర్ఎస్ నాయకులు భౌతిక దాడులకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. కేసీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే ప్రజా క్షేత్రంలో బీజేపిని నేరుగా ఎదుర్కోవాలి. ఇలాంటి దాడులు చేయించడం పిరికిపంద చర్య అన్నారు. సీఎం డైరెక్షన్ లోనే ఈ దాడులు జరుగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయని తెలిపారు కిషన్ రెడ్డి. నాగార్జున సారగ్ నియోజకవర్గంలోని నెల్లికల్ లిఫ్టుని కుర్చీ వేసుకొని కట్టిస్తా అన్న వాగ్దానం ఇప్పటికి నెరవేరలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.