Kishan Reddy : కిషన్ రెడ్డీ.. మీకు తప్పదు ! రాష్ట్ర అధ్యక్షుడిగా కంటిన్యూ..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డినే కంటిన్యూ చేయాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యేదాకా కొనసాగాలని నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజులే టైమ్ ఉండటంతో.. ఈ టైమ్ లో అనవసరంగా రిస్క్ ఎందుకని కమలం పార్టీ భావించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 14, 2023 | 12:58 PMLast Updated on: Dec 14, 2023 | 12:58 PM

Kishan Reddy You Must Continue As State President

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డినే కంటిన్యూ చేయాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యేదాకా కొనసాగాలని నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజులే టైమ్ ఉండటంతో.. ఈ టైమ్ లో అనవసరంగా రిస్క్ ఎందుకని కమలం పార్టీ భావించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. బండి సంజయ్ ను తప్పించి.. కిషన్ రెడ్డిని నియమించింది పార్టీ హైకమాండ్. కానీ తాను ఈ ఎన్నికల తర్వాత తప్పుకుంటానని ముందే చెప్పారు కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ 8 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. అందుకే ముందు చెప్పిన ప్రకారం ఎలక్షన్స్ అయిపోయినందున.. బీజేపీకి ఆశించిన ఫలితాలు కూడా రానందున తాను తప్పుకుంటానని కిషన్ రెడ్డి ఢిల్లీ పెద్దలకు చెప్పారు. అంతేకాదు సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు పరిధిలో ఒక్క సీటు కూడా బీజేపీ గెలుచుకోలేదు. అందువల్ల ఇప్పటి నుంచే పార్టీని పటిష్టం చేసుకోకపోతే.. రేపు ఎంపీ ఎన్నికల్లో ఎదురుగాలి వీచే ఛాన్సుంది. అందువల్ల రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు చూడటం కష్టమవుతుందని చెప్పారు రేవంత్ రెడ్డి. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం ఇప్పటికిప్పుడు మళ్ళీ అధ్యక్షుడిని మార్చే అవకాశం లేదని నచ్చచెప్పింది.

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోసం ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. 3 రాష్ట్రాల్లో ఘన విజయం ద్వారా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని బీజేపీ భావిస్తోంది. అంటే ఇంకా రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలవుతోంది. ఈ టైమ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి తప్పించి.. మరొకరికి ఛాన్స్ ఇస్తే ఇబ్బందులు కొని తెచ్చుకోవడమే అని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తోంది. అందుకే ఆయన్నే కంటిన్యూ చేయాలని డిసైడ్ అయింది.

Gaddam Prasad Kumar : తెలంగాణ మూడో అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక..

అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో.. పోస్ట్ మార్టమ్ కు సిద్ధమైంది కమలం పార్టీ. ఈనెల 15 నుంచి రాష్ట్ర పదాధికారులు, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు, ఇతర నేతలతో సమావేశాలను నిర్వహిస్తోంది. ఇందులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ తదితరులు పాల్గొంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష జరుపుకొని.. నెక్ట్స్ పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళాలి అన్నదానిపై దృష్టిపెడుతోంది బీజేపీ హైకమాండ్. ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా కొందరు నేతల నుంచి డిమాండ్ వస్తోంది. ఆ ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు.