KODALI NANI: నన్ను ఓడించాలంటే చంద్రబాబు గుడివాడ నుంచి పోటీ చేయాలి: కొడాలి నాని
కుట్రలు, కుతంత్రాల్లో భాగంగానే నాకు, వంశీకు సీటు లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. టిడిపిలో అయితే వారి మీడియా ఛానల్సే అభ్యర్థుల లిస్టులు ప్రకటిస్తాయి. ఎవరో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయానికి తీసేశాడు.
KODALI NANI: తనను ఓడించాలంటే చంద్రబాబు గుడివాడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని సవాల్ విసిరాడు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. వైసీపీ.. గుడివాడ టిక్కెట్ కొడాలి నానికి దక్కడం లేదనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. “గుడివాడలో ఎవరు పోటీ చేయాలో సీఎం జగనే చెబుతారు. రామోజీ, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, పౌడర్ డబ్బా గాళ్ళు కాదు. సీఎం జగన్ మార్చే అభ్యర్థులు, తీసేసే వారి పేర్లనే గత ఏడు లిస్టుల్లో ప్రకటించారు.
KCR: ఈ వారం ఢిల్లీ టూర్‌కు కేసీఆర్.. బీజేపీతో పొత్తు ఖాయమేనా..?
రాష్ట్రంలో ఇంకా సీట్లు ప్రకటించని 105 సీట్లు ఉన్నాయి. వినేవాడు తెలుగు తమ్ముళ్లైతే.. చెప్పేవాడు చంద్రబాబులా ఎల్లో మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది. సీటు ఎవరికో అధిష్టానం, మా పార్టీ నాయకులు చెబుతారు. మధ్యలో ఉన్న పకోడీ గాళ్ళకేం సంబంధం. తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తులకు సీఎం జగన్ సీటు ఇచ్చాడు. బ్రోకర్ పనులు. పైరవీలు చేస్తేనో, డబ్బుందనో, ఎవరో చెప్పారనో వైసీపీలో సీట్లివ్వరు. సీఎం జగన్‌లా చంద్రబాబు మగాడైతే.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు ఇవ్వాలి. గన్నవరం నుంచి వల్లభనేని వంశీనే పోటీ చేస్తాడు. కుట్రలు, కుతంత్రాల్లో భాగంగానే నాకు, వంశీకు సీటు లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. టిడిపిలో అయితే వారి మీడియా ఛానల్సే అభ్యర్థుల లిస్టులు ప్రకటిస్తాయి. ఎవరో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయానికి తీసేశాడు. ఫ్లెక్సీలు ఎవడైనా కట్టవచ్చు. అవి అర్థవంతంగా ఉండాలిగా.
దమ్ముంటే నన్ను ఓడించడానికి చంద్రబాబును గుడివాడ అభ్యర్థిగా పెట్టాలి. అదెలాగో చేతకాదు. ఎల్లో మీడియా అధినేతలందరూ అనుకుంటే నా సీటు పోతుందా. జీవితాంతం మాజీగా ఉండే చంద్రబాబు ఎక్స్‌లో ఛాలెంజ్‌లు చేస్తున్నాడు. సీఎం జగన్ ప్రస్తుతమే, కాదు పెర్మనెంట్ ముఖ్యమంత్రిగా ఉంటాడు. చంద్రబాబు సీఎం జగన్ ను కాకుండా, తనలా మాజీలుగా ఉండే వాళ్లపై X లో ఛాలెంజ్లు చేసుకోవాలి” అని నాని వ్యాఖ్యానించాడు.