సజ్జలపై కొడాలి పేకాట కోపం తగ్గలేదా…? తాడేపల్లి గడప తొక్కనంటున్న నానీ
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాజీ మంత్రి కొడాలి నాని అన్ని విధాలుగా ఆ పార్టీలో తన డామినేషన్ కొనసాగించారు. వైసీపీలో జగన్ తర్వాత ఆ రేంజ్ లో ఫేమస్ అయ్యారు నానీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అత్యంత ఆప్తుడిగా అత్యంత సన్నిహితుడుగా మెలిగిన కొడాలి నాని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడున్నారో, ఏమైపోయారో, ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాజీ మంత్రి కొడాలి నాని అన్ని విధాలుగా ఆ పార్టీలో తన డామినేషన్ కొనసాగించారు. వైసీపీలో జగన్ తర్వాత ఆ రేంజ్ లో ఫేమస్ అయ్యారు నానీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అత్యంత ఆప్తుడిగా అత్యంత సన్నిహితుడుగా మెలిగిన కొడాలి నాని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడున్నారో, ఏమైపోయారో, ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. అప్పుడప్పుడు తాడేపల్లిలో కనపడటం మినహా. రాజకీయంగా వైసిపి నానా కష్టాలు పడుతున్నా… వైయస్ జగన్ ను విద్యుత్ ఒప్పందాల విషయంలో అన్ని పార్టీలు కార్నర్ చేస్తున్న కొడాలి నాని మాత్రం ఇప్పటివరకు బయటకు వచ్చిన పరిస్థితి లేదు.
గతంలో జగన్ ను చిన్న మాట ఎవరైనా అంటే నానీ బూతుల పురాణం అందుకునే వారు. రాజకీయంగా జగన్ కు ఒక దశలో అండగా నిలబడిన వ్యక్తుల్లో కొడాలి నాని ఒకరు. జగన్ పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో జాయిన్ అయి ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు. ఇక జగన్ కూడా కొడాలి నాని మాస్ ఇమేజ్ చూసి ఆయనకు అన్ని విధాలుగా సహకారం అందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కోడలు నానికి మంత్రి పదవి కూడా కట్టబెట్టారు జగన్. అలాంటి కొడాలి నాని ఇప్పుడు వైసీపీ కష్టాల్లో ఉన్న సమయంలో ఎక్కడున్నారో కూడా ఆ పార్టీ నేతలకు కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉందనే భయమో లేక మరేదైనా కారణమో తెలియదు గాని, కొడాలి నాని మాత్రం బయటకు వచ్చే ప్రయత్నం ఏ విధంగా కూడా చేయడం లేదు. అయితే వైసిపి నేతల ఫోన్ కాల్స్ కు కూడా కొడాలి నాని నుంచి స్పందన కరువైంది. ఒకప్పుడు తాడేపల్లి లో ఉన్న జగన్ నివాసానికి పదే పదే వెళ్లిన కొడాలి నాని ఇప్పుడు కనీసం తాను ఎక్కడున్నాను అనే సమాచారాన్ని పార్టీ నేతలు కూడా ఇచ్చే ప్రయత్నం చేయటం లేదు. పార్టీ ఓడిపోయిన తర్వాత కొడాలి నాని గుడివాడ వెళ్ళింది కూడా చాలా తక్కువ. 1, 2 సార్లు మాత్రమే వెళ్లిన అక్కడ పార్టీ నేతలను కూడా ఆయన కలవలేదు. ఇక గుడివాడ కార్యకర్తలు కూడా కొడాలి నాని అందుబాటులో ఉండటం లేదు.
జగన్ తాడేపల్లి నివాసానికి వచ్చిన ప్రతిసారి కొడాలి నాని కి ఫోన్ వెళుతున్నా ఆయన మాత్రం ఏదో కారణంతో తప్పించుకుంటున్నారట. ఒకప్పుడు వైసిపి కార్యకర్తలకు అన్ని విధాలుగా ధైర్యాన్ని ఇచ్చిన కొడాలి నాని ఇప్పుడు సైలెంట్ కావడంతో గుడివాడ వైసిపి కార్యకర్తలు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఓవైపు గుడివాడలో తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుంటే కొడాలి నాని మాత్రం నియోజకవర్గ ప్రజల వైపు చూడటం లేదు. నాలుగు సార్లు ఎమ్మెల్యేని చేసిన ప్రజలను నానీ లైట్ తీసుకున్నారు.
మొన్న బుడమేరు వరదల సమయంలో కూడా కొడాలి నాని గుడివాడ వెళ్లలేదు. ఇప్పుడు తాడేపల్లి నివాసం నుంచి వైసీపీ కీలక నేతలు ఫోన్ చేస్తున్న సరే కొడాలి నాని నుంచి మాత్రం స్పందన కరువైంది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి తో ఉన్న విభేదాలు, కొడాలి నాని వైసీపీకి దూరం కావడానికి కారణమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నందివాడ మండలంలో కొడాలి నాని ఆధ్వర్యంలో నడుస్తున్న పేకాట శిబిరాలపై పోలీసులు అప్పట్లో దాడి చేయడం సంచలనమైంది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి కొడాలి నానిని కమిషన్ డిమాండ్ చేశారని కొడాలి నాని ఇవ్వడానికి నిరాకరించడంతోనే పేకాట శిబిరాలపై పోలీసులతో దాడులు చేయించారనే కోపం కొడాలి నానిలో ఇప్పటికీ ఉంది.
తాను ముందు నుంచి జగన్ కు అండగా ఉంటే మధ్యలో సజ్జల జోక్యంతో తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని జగన్ దృష్టికి కొడాలి నాని పలుమార్లు తీసుకెళ్లారు. అయినా సరే ఈ విషయంలో జగన్ కూడా పెద్దగా జోక్యం చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఇక కృష్ణాజిల్లా వ్యవహారాల్లో కూడా పదే పదే సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకోవడం, జిల్లాలో కొడాలి నాని ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం కూడా నానికి నచ్చలేదు. అప్పట్లో కేసినేని నానీని వైసీపీలోకి తీసుకురావడంలో కొడాలి నాని సఫలమయ్యారు. ఆ తర్వాత నానికి జిల్లాలో కాస్త ప్రాధాన్యత పెరిగినా మళ్లీ సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యంతో తన సన్నిహితులకు కూడా సీట్లు ఇప్పించుకోలేకపోయాను అనే ఆవేదన కొడాలి నాని సన్నిహితులు వద్ద వ్యక్తం చేశారు.
ఇప్పుడు సజ్జలపై కోపంతోనే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని అందుకే పార్టీ ఆఫీస్ వద్దకు కూడా వెళ్లడం లేదని, వాస్తవానికి కొడాలి నాని ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు కూడా దూరంగా కావాలని నిర్ణయించుకున్నారని, తన సోదరుడికి గుడివాడ బాధ్యతలు అప్పగించాలని ముందు భావించిన ఆయనకు ఆసక్తి లేకపోవడంతో పూర్తిగా హైదరాబాదులోనే ఉంటున్నారని గుడివాడ వైసీపీ నేతలు అంటున్నారు