కొడాలి నానీకి గుండె ఆపరేషన్.. అసలేం జరిగింది…?
మాజీ మంత్రి కొడాలి నానీ ఆరోగ్యంపై రెండు రోజుల నుంచి వస్తున్న వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.

మాజీ మంత్రి కొడాలి నానీ ఆరోగ్యంపై రెండు రోజుల నుంచి వస్తున్న వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయనకు గుండెపోటు అని గ్యాస్ట్రిక్ సమస్య అని ఇలా ఏవేవో వార్తలు బయటకు వచ్చాయి. రెండు రోజుల క్రితం నానీ ఏఐజీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఆయనకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు.. ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఆపరేషన్ చేయాల్సిందే అని డాక్టర్లు చెప్పడంతో వైసీపీలో ఆందోళన మొదలైంది.
కొడాలి నానీ గుండెలో మూడు వాల్వులు బ్లాక్ అయినట్టు డాక్టర్లు పేర్కొన్నారు. ఆపరేషన్ చేయాలని తేల్చిన వైద్యులు ఎప్పుడు చేస్తారనే దానిపై ప్రకటన చేయలేదు. ఈ విషయమై ఆస్పత్రి వైద్యులతో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫోన్ లో మాట్లాడారు. దీనిపై గుడివాడ వైసీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందే అవకాశం ఉండటంతో నానీ ఆరోగ్యంపై ఏ విధమైన ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చారు. వైఎస్ జగన్ డాక్టర్లతో మాట్లాడిన తర్వాతనే ఆపరేషన్ విషయం తెలిసింది అన్నారు.
కొడాలి నాని త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు శశిభూషణ్. ఏఐజి నుంచి నానీ డిశ్చార్జ్ కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయనకు నిర్వహించిన హెల్త్ టెస్టుల్లో గుండె కవాటాల్లో క్లాట్లు ఉన్నట్లు తేల్చారు. వీటికి సంబంధించి అత్యవసరంగా చికిత్స చేయించుకోవాల్సిన అవసరం లేదని, స్టంట్ లు వేయడమా, బైపాస్ సర్జరీ చేయడమా అనేదానికి సంబంధించి ఇంకా కొడాలి నాని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సెకండ్ ఒపీనియన్ కోసం ఇతర హాస్పిటల్స్ తో సంప్రదింపులు జరుపుతున్నారు నానీ కుటుంబ సభ్యులు. సెకండ్ ఒపీనియన్ తరువాత ఉగాది తరువాత పూర్తిస్థాయి చికిత్స చేయించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.