జగన్ కు షాక్ ఇచ్చిన కొడాలి, రాజకీయాలకు గుడ్ బై
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు తలలో నాలుకలా ఉండేవారు కొడాలి నానీ. ఓ వైపు జగన్ కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టినా తిట్టించినా కొడాలి నానీని మాత్రం గుండెల్లో పెట్టుకునే వారు. పెట్టుకునేవారో లేదో గాని పెట్టుకున్నట్టు టాక్ అయితే వచ్చేది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు తలలో నాలుకలా ఉండేవారు కొడాలి నానీ. ఓ వైపు జగన్ కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టినా తిట్టించినా కొడాలి నానీని మాత్రం గుండెల్లో పెట్టుకునే వారు. పెట్టుకునేవారో లేదో గాని పెట్టుకున్నట్టు టాక్ అయితే వచ్చేది. అందుకే కొడాలి నానీ… జగన్ రాజకీయ ప్రత్యర్ధులను తన మాటలతో చీల్చి చెండాడే వారు. నోరు తెరిస్తే ఆయన నోటి నుంచి బూతుల వర్షమే. కృష్ణా జిల్లా యాసలో పక్కాగా మాట్లాడే నానీ మాటలకు మీడియాలో కూడా వెయిట్ ఉండేది. మాస్ ఆడియన్స్ కు బాగా ఎక్కేవి.
కాకపోతే అవే రివర్స్ అయి ఆయన 50 వేల ఓట్లతో ఓడిపోయే పరిస్థితి వచ్చింది. గుడివాడ అడ్డా నుంచి నానీని బయటకు పంపించారు అక్కడి ప్రజలు. ఇప్పుడు నానీ గుడివాడ కూడా పెద్దగా వెళ్ళడం లేదని టాక్. అక్కడున్న వైసీపీ నేతలతో కూడా ఆయన పెద్దగా టచ్ లో లేరు. బుడమేరు వరదల ప్రభావం ఆయనకు పట్టున్న నందివాడపై పడినా నానీ మాత్రం అటు వైపు వెళ్ళలేదు. గుడ్లవల్లేరు కాలేజిలో అంత సీన్ జరిగినా నానీ వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక జగన్ ఎప్పుడైనా పిలిస్తే తాడేపల్లి వెళ్తున్నారు.
2014 నుంచి 19 వరకు నానీ విపక్షంలో ఉన్నా సరే ధైర్యంగా ఉండేవారు. కాని ఇప్పుడు ఆ ధైర్యం నానీలో కనపడటం లేదు. మరి రాజకీయాలపై విరక్తి రావడమో లేక… ఏం మాట్లాడితే ఏ చిక్కు వస్తుందో అనే భయమో తెలియదు గాని నానీ సైలెంట్ అయిపోయారు. తిరుపతి లడ్డు విషయంలో ఏదో నాలుగు మాటలు మాట్లాడారు గాని వాటిల్లో కూడా నానీ మార్క్ కనపడలేదు. వాడు వీడు అని మాట్లాడే నానీ మాటల్లో గౌరవం కనపడింది. సో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేది నానీ ఆలోచనలో పడ్డారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పాలనే డెసిషన్ కు వచ్చేశారని టాక్.
ఇటీవల తన సన్నిహితులతో మాట్లాడుతూ నాలుగు సార్లు ఎమ్మెల్యేని అయ్యాను, మంత్రిని అయ్యాను… ఆరోగ్యం కూడా సహకరించడం లేదు, ఇక రాజకీయాల మీద ఆసక్తి లేదని నానీ చెప్పారట. అందుకే గుడివాడ రాజకీయాల్లో నానీ వేలు పెట్టడం లేదు. చాలు అనుకుని ఇక సెలవు ప్రకటించారు. అందుకే ఇటీవల కృష్ణా జిల్లా అధ్యక్ష పదవి కూడా నానీకి ఇవ్వకుండా మరో నానీ… పేర్ని నానీకి ఇచ్చారు. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే నానీ ఇలా రాజకీయాలకు గుడ్ బై చెప్పడం అనేది విస్మయానికి గురి చేస్తోంది. ఏదేమైనా తెలుగు ప్రజలు బూతులు మిస్ అయినట్టే.