బ్రేకింగ్: విషమంగా కొడాలి ఆరోగ్యం..? ముంబైపై అనుమానాలు
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానీ ఆరోగ్యం వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల ఆయనకు గుండె సమస్యలు రావడంతో ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేసారు వైద్యులు

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానీ ఆరోగ్యం వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల ఆయనకు గుండె సమస్యలు రావడంతో ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేసారు వైద్యులు. ఇప్పుడు ఆరోగ్యం మరింత ఇబ్బందికరంగా మారడంతో కొడాలి నానీని ముంబై తరలించారు కుటుంబ సభ్యులు. మాజీ కొడాలి నాని కి ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయనున్నారు. ప్రత్యేక విమానంలో నానిని ముంబై తరలిస్తున్నారు కుటుంబ సభ్యులు.
గుండెలో మూడు వాల్వులు పూర్తిగా చెడిపోయినట్లు గుర్తించిన ఏఐజి వైద్యులు.. ఈ మేరకు సర్జరీ చేయించుకోవాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు అలెర్ట్ అయ్యారు. ఏఐజి ఆసుపత్రికి వచ్చిన ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ హృద్రోగ నిపుణులు.. నానీకి మిగిలిన పరిక్షలు కూడా నిర్వహించారు. హైదరాబాదులో ప్రైవేట్ ఫ్లైట్స్ దొరకకపోవడంతో ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి విమానాన్ని రప్పించి…. దానిలోనే నానిని తరలించారు. ప్రాథమిక వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో గుడివాడ నానికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయనున్నారు.
ఏఐజీ లో కాకుండా ముంబై బ్రీచ్ క్యాండీ కి తరలించి అక్కడ కొడాలి నాని కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. వైసీపీలో నానీ కీలక నేతగా ఉన్నారు. మంత్రిగా పని చేసిన ఆయనకు దూకుడు స్వభావం ఉన్న నేతగా పేరుంది. మీడియా సమావేశాల్లో నానీ మాట్లాడే మాటలు అప్పట్లో వివాదాస్పదం అయ్యేవి. టీడీపీ అగ్ర నాయకత్వాన్ని నానీ తీవ్రంగా విమర్శించేవారు. జగన్ ను విమర్శించే ఎవరిని అయినా సరే తన మాటలతో చీల్చి చెండాడే వారు నానీ.