Top story : ఇలా తగులుకున్నావ్ ఏంట్రా ? చంద్రబాబుకి తలనొప్పిగా మారిన కొలికపూడి..!
టీవీ డిబేట్లు చూసి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఇలాగే ఉంటుంది. టీవీల్లో ఊకదంపుడు ప్రసంగాలు, సవాళ్లు చూసి ఇంతకంటే పోటుగాడు దొరకడు అనుకోని కొలికిపూడి శ్రీనివాసరావుకి కృష్ణాజిల్లా తిరువూరు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు చంద్రబాబు.

టీవీ డిబేట్లు చూసి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఇలాగే ఉంటుంది. టీవీల్లో ఊకదంపుడు ప్రసంగాలు, సవాళ్లు చూసి ఇంతకంటే పోటుగాడు దొరకడు అనుకోని కొలికిపూడి శ్రీనివాసరావుకి కృష్ణాజిల్లా తిరువూరు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు చంద్రబాబు. అదే కొలికపూడి తిరువూరులో అందరినీ కెలికి కెలికి వదిలి పెడుతున్నాడు. కూటమి గెలిచిన 164 నియోజకవర్గాల్లో ఎక్కడ ఇలాంటి తలకుమాసిన వ్యవహారాలు చంద్రబాబుకు ఎదురు కాలేదు. ఒక్క తిరువూరు పేరు చెప్తే మాత్రం పార్టీలో అందరూ అమృతాంజనం బాటిల్స్ అందుకుంటున్నారు. అలా చెలరేగిపోయి సీఎం దగ్గర్నుంచి అందరికీ తలనొప్పిగా మారిపోయాడు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.
నేను చెప్పింది చేయకపోతే…. రాజీనామా చేసి పారేస్తా ఏదో ఒకటి తేల్చుకొని చెప్పండి అంటూ 40 ఇయర్స్ చంద్రబాబుకే డెడ్ లైన్ ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యే కొలిక పూడి. చివరికి విసిగిపోయిఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారంలో చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది ప్రతిసారి తిరువూరులో పార్టీకి సంబంధించి తలెత్తే వివాదానికి ఎమ్మెల్యే ప్రధాన కారణం కావడంతో సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే రెండు మూడుసార్లు ఎమ్మెల్యే తీరు మారుతుందని ఎదురుచూసినా ఎమ్మెల్యే తీరు మారకపోగా మరింత వివాదాస్పదంగా వ్యవహరించటంతో చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇకపై ఆయన విషయంలో వేచి చూసే ధోరణిలో ఉండకూడదనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్టుగా పార్టీ వర్గాల మాట.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ విషయంలో పార్టీ అధిష్టానం ఇక ఉపేక్షించకూడదని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది నియోజక వర్గం లో పార్టీ నేత మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయకపోతే 48 గంటల్లోగా రాజీనామా చేస్తానని కొలికపూడి అల్టిమేటం జారీ చేయడం రాజకీయ చర్చకు దారితీసింది దీనితోపాటు కులానికి ఒక న్యాయం పార్టీ చేయటం ఏంటనీ బహిరంగంగానే కోలిక పూడి చేసిన విమర్శలు పార్టీ అధిష్టానానికి ఆగ్రహాం తెప్పించాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలను ఎమ్మెల్యే బహిరంగంగా మాట్లాడటం, పార్టీ అధిష్టానానికి డెడ్లైన్ పెట్టడం, పార్టీపై నేరుగా విమర్శలు చేయడం అధిష్టాన సీరియస్ గా తీసుకుంది.
ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా కొలకపూడి శ్రీనివాస్ వల్ల పార్టీ క్యాడర్ ఇబ్బందులు పడటంతో పాటు పార్టీ నాయకత్వం కూడా పలు విధాలుగా ఇబ్బంది పడుతుందని విషయాన్ని చంద్రబాబు దృష్టికి పార్టీ నేతలు తీసుకెళ్లారు ఇప్పటికే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు ఆయన వల్ల జరిగిన వివాదాస్పద ఘటనలు పార్టీకి జరిగిన డ్యామేజ్ అన్ని అంశాల పైన పార్టీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం ఎంపీ కేసీనేని చిన్ని అబ్జర్వర్లతో కూడిన కమిటీ చంద్రబాబుకి పరిస్తితి వివరించింది. పార్టీని గెలిపించిన కార్యకర్తల మనోభావాలకు అనుకూలంగా పనిచేయాల్సి ఉందని సభ్యులతో సీఎం అన్నారు. పార్టీ క్యాడర్, కమిటీ సభ్యుల నుండి వచ్చిన ఫిర్యాదులు అన్నిటిని పరిశీలించి కొలికపూడి విషయంలో ఓ నిర్ణయం తీసుకునే ఆలోచనలో అధినేత చంద్రబాబు ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తిరువూరు నియోజకవర్గానికి చెందిన నేతలు పెద్ద ఎత్తున రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావును కలిసి కోలికపూడి శ్రీనివాస్ వల్ల తాము నియోజకవర్గంలో పడుతున్న ఇబ్బందులను వివరించారు ఆయనకి ప్రత్యామ్నాయంగా నియోజకవర్గంలో ఇన్చార్జిని ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే టిడిపి శ్రేణులను కేడర్ను పట్టించుకోవడంలేదని వైసిపి నాయకులతో కలిసి పని చేస్తున్నారని కులాల వారీగా క్యాడర్ను విభజించి తమ మధ్య వైషమ్యలు ల్యాలు సృష్టిస్తున్నారని కొలికపూడిపై ఫిర్యాదు చేశారు అధిష్టానం తరపున నియోజకవర్గంలో ఒక సమన్వయ కమిటీని కేడర్ కోసం ఏర్పాటు చేయటం పరిశీలించాలని రాష్ట్ర అధ్యక్షుడు పళ్ళ శ్రీనివాస్ ను కోరారు.
తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు తాను తెప్పించుకున్న నివేదిక అంశాలు అన్నిటిని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి తదుపరి నిర్ణయం తీసుకుంటామని పల్లా పార్టీ క్యాడర్కు హామీ ఇచ్చారు దీంతో కొలుకుపూడి శ్రీనివాస్ కు గట్టి వార్నింగ్ ఇవ్వటానికి అధిష్టానం సిద్ధమవుతున్నట్టుగా పార్టీ వర్గాల నుంచి ప్రచారం జరుగుతుంది.లేదా కొలికపోటుకు ప్రత్యామ్నాయంగా ఏమన్నా తిరువూరులో పార్టీ క్యాడర్ కోసం చర్యలు చేపట్టే అవకాశాలు ఉంటాయా అనేది కూడా చర్చ జరుగుతుంది.