ఢిల్లీ మంత్రివా గల్లి మంత్రివా: కోమటిరెడ్డి సెటైర్లు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సెటైరికల్ కౌంటర్లు వేసారు. కేంద్ర మంత్రిగా గల్లీలో నిద్రలు ఏంటి? వారానికి 3 రోజులు ఇక్కడే ఉంటున్నారు అని ఎద్దేవా చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 18, 2024 | 06:07 PMLast Updated on: Nov 18, 2024 | 6:07 PM

Komatireddy Fire On Kishan Reddy

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సెటైరికల్ కౌంటర్లు వేసారు. కేంద్ర మంత్రిగా గల్లీలో నిద్రలు ఏంటి? వారానికి 3 రోజులు ఇక్కడే ఉంటున్నారు అని ఎద్దేవా చేసారు. కేంద్ర మంత్రి పదవులు ఇచ్చింది ఢిల్లీలో ఉండడానికా? గల్లీలో ఉండదానికా? అని నిలదీశారు. కిషన్ రెడ్డి కి దమ్ముంటే నల్గొండలో మూడు నెలలు పడుకొని కాళ్ళు చేతులు వంకలు కాకుండా హైదరాబాద్ వస్తారా అని ప్రశ్నించారు.

కిషన్ రెడ్డికి ఢిల్లీలో దోమల భాధకు తట్టుకోలేక హైదరాబాద్ లో ఉంటున్నారన్నారు. భషీర్ భాగ్ లో రైతుల పై చంద్రబాబుతో కలిసి కేసీఆర్ కాల్పులు జరిపారని విమర్శించారు. 80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ మూసీ శుద్ధీకరణ వద్దు ప్రకటన చేస్తే …మేము ప్రాజెక్టు నిలిపివేస్తామన్నారు. నేనే మా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ప్రాజెక్టు ఆపమని కోరుతామని తెలిపారు. అనాడు కేటీఆర్ రైతులను పోలీసులను ఫార్మా సిటీ విషయంలో కొట్టించారని మండిపడ్డారు. ఈనాడు రైతుల ముసుగులో కలెక్టర్ పై దాడి చేయించారన్నారు. ఇలానే దాడి చేస్తే అనాడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసేవాళ్ళ అని ప్రశ్నించారు.