కొండా సురేఖ మత్తులో ఉంది: ఆర్ఎస్ ప్రవీణ్ సంచలనం

బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. 28మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని గురుకులాల్లో ఉన్న సమస్యలపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తామన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 30, 2024 | 02:25 PMLast Updated on: Nov 30, 2024 | 2:25 PM

Konda Surekha Is Intoxicated Rs Praveen Creates Sensation

బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. 28మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని గురుకులాల్లో ఉన్న సమస్యలపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తామన్నారు. మతిస్థిమితం లేని మంత్రులతో నాపై రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. కొండా సురేఖను తెలంగాణ సమాజం తిరస్కరించిందన్నారు. కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదని ఆయన మండిపడ్డారు.

నేను ప్రభుత్వ హాస్టల్స్ లో చదువుకుని ఐపిఎస్ అయ్యానని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం పనిచేశానని ఆయన చెప్పుకొచ్చారు. కొండా సురేఖ కుటుంబం గురించి వరంగల్ ప్రజలకు తెలుసన్నారు. కొండా కుటుంబానికి నళిని ప్రభాత్ వరంగల్ నడి రోడ్డులో కౌన్సిలింగ్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేసారు. మంత్రి సీతక్క తన మూలాలు మర్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. కొండా సురేఖ మత్తులో ఉండి మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. కొండా సురేఖకు నేరచరిత్ర ఉందన్నారు. ఆకునూరి మురళీ ఫుడ్ పాయిజన్ పై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.