కేటిఆరే కారణం: తగ్గని కొండక్క
మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసారు మరోసారి. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని హెచ్చరించారు.
మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసారు మరోసారి. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని హెచ్చరించారు. మంచి ఆలోచనతో ప్రతిపక్ష నేతగా సలహాలు ఇవ్వాలని హితవు పలికారు. ప్రభుత్వ పనులకు అడ్డుపడితే ప్రజలు ఊరుకోరు అని హెచ్చరించారు. కేసీఆర్‌ను పక్కనపెట్టి సీఎంలా కేటీఆర్ వ్యవహరించారన్నారు సురేఖ. కేటీఆర్ ఎన్నో కుంభకోణాలు చేశారని ఆరోపించారు.
పనికిమాలిన పనులు చేసి బీఆర్ఎస్ కు చెడ్డపేరు తెచ్చారన్నారు. బీఆర్‌ఎస్ ఓటమికి కేటీఆర్ కారణం అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. పదేళ్లుగా ఉన్న అధికారం కోల్పోవడంతో.. ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని ఆరోపించారు. అధికార కాంక్షతో కేటిఆర్ రెచ్చిపోతున్నారని విమర్శించారు.