కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ… ఏమైంది…?
ఎమ్మెల్యేలు అరికేపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. మీడియా సమావేశం ఏర్పాటు చేసి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సీరియస్ అయ్యారు.

ఎమ్మెల్యేలు అరికేపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. మీడియా సమావేశం ఏర్పాటు చేసి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సీరియస్ అయ్యారు. కౌశిక్ రెడ్డి తన ఇంటికి వస్తాను అనడంపై గాంధీ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ బయల్దేరగా… కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్ గాంధీని కలిసారు.
అనంతరం తన ఇంటి బయట గాంధీ కుర్చీ వేసుకుని కూర్చున్నారు. కౌశిక్ వస్తా అన్నాడు అతనికోసం ఇంటి ముందు కుర్చీ వేసుకుని కూర్చున్నా రావాలి అంటూ సవాల్ చేసారు. 12 గంటల వరకు చూసి నేనే కౌశిక్ ఇంటికి వెళ్తాను అంటూ సవాల్ చేసారు. ఇక కౌశిక్ రెడ్డి కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. నువ్వు ముసలోడివి నేను 39 ఏళ్ళ యువకుడ్ని అంటూ మాట్లాడారు.