CM KCR: కేసీఆర్‌కు ఏమైంది..? కేసీఆర్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన కేటీఆర్‌..!

కేసీఆర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. నిజానికి తెలంగాణలో బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించాల్సి ఉంది. అయితే ఆయనకు వైరల్ ఫీవర్ ఇంకా తగ్గకపోవడంతో ప్రగతి భవన్లోనే చికిత్స పొందుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 6, 2023 | 08:10 PMLast Updated on: Oct 06, 2023 | 8:10 PM

Ktr Announced About Cm Kcr Health Update

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌.. గత పదిరోజులుగా బయట కనిపించడం లేదు. దక్షిణ తెలంగాణ లక్ష్యంగా కేటీఆర్, హరీశ్‌.. వరుస అభివృద్ధి పనులు, సభలతో దూసుకుపోతున్నారు. కేసీఆర్‌కు జ్వరం వచ్చిందని ఆ మధ్య కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా చెప్పారు. ఆ తర్వాత నుంచి సీఎం బయటికి రావడం లేదు. దీంతో కేసీఆర్‌కు ఏమైంది అనే టెన్షన్‌ కనిపిస్తోంది.

కేసీఆర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. నిజానికి తెలంగాణలో బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించాల్సి ఉంది. అయితే ఆయనకు వైరల్ ఫీవర్ ఇంకా తగ్గకపోవడంతో ప్రగతి భవన్లోనే చికిత్స పొందుతున్నారు. సీఎం కేసీఆర్‌కు వైరల్ ఫీవర్ వచ్చి దాదాపు 10 రోజులు అయింది. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. మరోవైపు సీఎం కేసీఆర్ ఇంకా కోలుకోలేదని సమాచారం తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

గురువారం నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. టికెట్ విషయం అడగ్గా తన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని, ఏం మాట్లాడలేక పోతున్నానని సీఎం కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. దీంతో అభిమానుల టెన్షన్ రెట్టింపు అయింది. ఐతే కేసీఆర్ హెల్త్ కండిషన్‌పై మంత్రి కేటీఆర్‌ రియాక్ట్ అయ్యారు. ఆయన చాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. కొద్దిరోజుల కింద వైరల్ ఫీవర్‌, ఇప్పుడు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ రావడం వల్ల.. కోలుకోవడానికి అనుకున్న సమయం కంటే.. ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని అన్నారు. ఇక అటు ఎన్నికల వేళ.. కేసీఆర్ పలు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది.

అలాగే పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కూడా పెద్ద ఎత్తున సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. ఐతే ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల అవన్నీ వాయిదా పడుతున్నాయ్. ప్రస్తుతం కేటీఆర్, హరీష్ రావు మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు.