ఫోన్ ట్యాపింగ్ లో అడ్డంగా దొరికారా…? కేటిఆర్ బుక్కయ్యారా…?
ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు లకు బిగ్ షాక్ ఇచ్చారు తెలంగాణా పోలీసులు. ఇద్దరి పాస్పోర్టులను ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం రద్దు చేయడం సంచలనం అయింది. దర్యాప్తుకు హాజరు కాకుండా అమెరికాలో ఇద్దరూ తల దాచుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు లకు బిగ్ షాక్ ఇచ్చారు తెలంగాణా పోలీసులు. ఇద్దరి పాస్పోర్టులను ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం రద్దు చేయడం సంచలనం అయింది. దర్యాప్తుకు హాజరు కాకుండా అమెరికాలో ఇద్దరూ తల దాచుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాస్పోర్ట్ రద్దు అంశాన్ని అమెరికా పోలీసులకు తెలియజేసేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నివేదిక పంపిన హైదరాబాద్ పోలీసులు… ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకునే అవకాశం కనపడుతోంది.
పాస్పోర్ట్ రద్దు విషయం అక్కడి పోలీసులకు తెలిస్తే ఇద్దరిని బలవంతంగా దేశానికి పంపే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభాకర్ రావు శ్రవణ్ రావులపై లుకౌట్ నోటీసులు జారీ చేసారు పోలీసులు. మరో వైపు రెడ్ కార్నర్ నోటీస్ జారీకి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ పోలీసుల నివేదికను ఇంటర్ పోల్ కు సిబిఐ అధికారులు పంపడం గమనార్హం. ఈ పరిణామాలు చూస్తుంటే కచ్చితంగా ఈ వ్యవహారంలో కీలక అడుగులు పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను అదుపులోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అప్పట్లో రేవంత్ రెడ్డి… ఈ అంశంపై తీవ్ర స్థాయిలో ప్రభాకర్ రావును టార్గెట్ చేసి… అధికారలోకి వచ్చిన తర్వాత అంతు చూస్తా, అరెస్ట్ చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల్లో ప్రైవేట్ సైన్యం తయారు చేయడం పట్ల కూడా ఆయన అప్పట్లో సీరియస్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విషయంలో రేవంత్ రెడ్డి సీరియస్ గా ఫోకస్ చేయడంతో వెంటనే ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళిపోయారు.
ఇప్పుడు ఎలా అయినా వాళ్ళను ఇండియా తీసుకు రావడానికి తెలంగాణా పోలీసులు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా కోరే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా ఈ విషయంలో కేటిఆర్ ను అదుపులోకి తీసుకునే ఛాన్స్ స్పష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా ఆరోపణలు వచ్చిందే కేటిఆర్ పై. సినిమా వాళ్ళ ఫోన్ లు కూడా ట్యాప్ చేసారని ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించారు. త్వరలోనే చార్జ్ షీట్ కూడా ఫైనల్ చేసి… కీలక నిందితులను అదుపులోకి తీసుకోవడం ఖాయంగా కనపడుతోంది.
ఫోన్ ట్యాపింగ్ లో కేసు నమోదు అయిన వెంటనే శ్రవణ్, ప్రభాకర్ రావు ఇద్దరూ అమెరికా వెళ్ళిపోయారు. ఈ ఏడాది మార్చ్ 10 న కేసు నమోదు అయింది. వాళ్ళను రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా ఎలా అయినా ఇండియా తీసుకు రావాలని… తెలంగాణా సిఐడీ… ద్వారా సిబిఐకి నివేదిక పంపారు. ఆ నివేదికను ఆమోదించిన అనంతరం ఇంటర్ పోల్ కు పంపింది. త్వరలోనే వీరిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల మంత్రి పొంగులేటి… దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా తెలుగు మీడియాతో మాట్లాడుతూ… పొలిటికల్ బాంబులు పేలతాయని సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఈ తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎవరి ఫోన్ ను ట్యాప్ చేయాలనే దానిపై శ్రవణ్ రావు చెప్పడంతోనే అధికారులు అడుగులు వేసారని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రిమాండ్ లో ఉన్న టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాదా కిషన్ రావు… అదనపు డీసీపీలుగా వదులు నిర్వహించిన భుజంగ రావు, తిరుపతన్న, డీఎస్పీ ప్రనీత్ రావు… విచారణలో భాగంగా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పేర్లను చెప్పారు. దీనితో అసలు సూత్రదారులపై అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు వైద్య చికిత్స కోసం ఇల్లినోయి ప్రాంతంలో… మియామిలో శ్రవణ్ రావు ఉన్నట్టు న్యాయస్థానానికి సమాచారం ఇచ్చారు.