రేవంత్ ఏం పీక్కుంటావో పీక్కో: కేటిఆర్
తెలంగాణా ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఫార్మాసిటీ కోసం ఎనిమిదేళ్లు కష్టపడి 14 వేల ఎకరాలు సేకరించామన్న ఆయన బంగారు పళ్లెంలో పెట్టి అప్పగిస్తే... సీఎం తుగ్లక్ లాగా ఫార్మాసిటీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని మండిపడ్డారు.
తెలంగాణా ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఫార్మాసిటీ కోసం ఎనిమిదేళ్లు కష్టపడి 14 వేల ఎకరాలు సేకరించామన్న ఆయన బంగారు పళ్లెంలో పెట్టి అప్పగిస్తే… సీఎం తుగ్లక్ లాగా ఫార్మాసిటీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని మండిపడ్డారు. సీఎం అనాలోచిత చర్యల వల్లే కొడంగల్, న్యాలకల్ లో రైతులు ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. భూములు తన్ని తీసుకుంటామని సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ఒక రైతును అన్న ఫోన్ వాయిస్ వైరల్ కూడా అయిందన్నారు. పట్నం నరేందర్ రెడ్డిని మఫ్టీలో ఉన్న పోలీసులు వారంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేశారు… కనీసం భార్యకు సమాచారం ఇచ్చారా? అని నిలదీశారు.
రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణరెడ్డి… మాక్స్ బియన్ ఫార్మా కంపెనీ విస్తరణ కోసం భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. అన్నం శరత్ మాక్స్ బియన్ ఫార్మా కంపెనీ డైరెక్టర్ అన్నారు. బీఆర్ఎస్ నేత సురేష్ తో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మాట్లాడితే తప్పా? అని నిలదీశారు. ఫోర్త్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు, అక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరుగుతోందన్న ఆయన… పది మంది వచ్చి నరేందర్ రెడ్డిని కిడ్నాప్ చేశారన్నారు.
న్యాయస్థానాల్లో పోరాడతాం అని స్పష్టం చేసారు. ఫార్ములా-ఈ గురించి సీఎం రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? రియల్ ఎస్టేట్ తప్ప అంటూ ఎద్దేవా చేసారు. నాపై ఏం విచారణ చేసుకుంటారో చేసుకోండి అని సవాల్ చేసారు. బీఆర్ఎస్ నేత సురేష్ నన్ను కలవడం తప్పు అయితే… నాపై కూడా కేసు పెడితే పెట్టుకోండి అంటూ చాలెంజ్ చేసారు.