రేవంత్ ఏం పీకుతవో పీకు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీపావళి లోపు బాంబు పేలుతుంది అంటూ చేసిన వాఖ్యలపై సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ స్పందించిన కేటీఆర్... సంచలన కామెంట్స్ చేసారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీపావళి లోపు బాంబు పేలుతుంది అంటూ చేసిన వాఖ్యలపై సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ స్పందించిన కేటీఆర్… సంచలన కామెంట్స్ చేసారు. బాంబు అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన మీద జరిగిన ఈడీ రైడ్ మీద ఏమన్న చెబుతాడేమో? అని ఎద్దేవా చేసారు. ఈడీ దాడుల్లో ఎన్ని నోట్ల కట్టలు దొరికాయి. ఎన్ని కట్టల పాములు దొరికినయన్నది చెబుతాడా? అని నిలదీశారు. ఎట్ల బీజేపీ తో సంధి కుదుర్చుకున్నది, ఎట్ల బీజేపీని బతిమిలాడి కేసు కాకుండా చూసుకున్నది, ఆదానీ కాళ్లు పట్టుకున్నది ఆ బాంబు ఏదైనా చెబుతాడా? అంటూ ప్రశ్నించారు.
అమృత్ పథకంలో భాగంగా ముఖ్యమంత్రి బావమరిది కి 1,137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి స్కాం చేశారని నేను ఆరోపిస్తున్నా…దాని మీద బీజేపోళ్లు స్పందించటం లేదన్నారు. దాని మీద విచారణకు ఆదేశించే బాంబు ఏమైనా పేల్చుతారా? అని ప్రశ్నించారు. అది లక్ష్మి బాంబా? సుతిలి బాంబా? తుస్సు బాంబా? అన్ని తేలుతాయి అన్నారు. నా మీద ఏమైనా కేసు పెట్టాలనుకుంటే ఏం పెట్టుకుంటావో పెట్టుకో. ఏం పీక్కుంటావో పీక్కో అని సవాల్ చేసారు. ఇటువంటి కొత్త బిచ్చగాళ్లను చాలా మందిని మేము చూశాం అన్నారు కేటిఆర్.
రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు లాంటి వాళ్లతోనే కొట్లాడాం. ఈ చిట్టి నాయుడు మాకు పెద్ద లెక్క కాదు అంటూ ఎద్దేవా చేసారు. చావుకు తెగించి తెలంగాణలో ఉద్యమంలో కొట్లాడినం అన్న ఆయన… ఈ హౌలగాళ్ల పిచ్చి డైలాగులకు భయపడేటోడు ఎవడు లేడు అన్నారు. వర్జినల్ బాంబులకే భయపడలేదు. వీళ్ల తుస్సు బాంబులకు భయపడేది లేదు అంటూ సవాల్ చేసారు. కానీ ఇప్పుడు ఎవ్వడైతే తెగించి రియల్ ఎస్టేట్ సెటిల్ మెంట్లు చేస్తున్నాడో, బిల్డర్లను బెదిరించి ఆర్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడో ఇంతకు వంద రెట్లు మిత్తి తో సహా ఇస్తాం అని హెచ్చరించారు. మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే. అప్పుడు వాళ్లను చూసుకునే బాధ్యత కూడా నాదే అన్నారు ఆయన.