దేవరకు కేటిఆర్ సపోర్ట్
గత ఆదివారం దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఈవెంట్ ను కావాలనే క్యాన్సిల్ చేసారనే విమర్శలు కూడా వినపడుతున్నాయి.
గత ఆదివారం దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఈవెంట్ ను కావాలనే క్యాన్సిల్ చేసారనే విమర్శలు కూడా వినపడుతున్నాయి. ఎన్టీఆర్ కావాలని టార్గెట్ చేసారని కొందరు అంటే కాదు ఇది ప్రమోషన్ ప్లాన్ అని మరికొందరు అంటున్నారు. ఇక తాజాగా ఈ వివాదంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన మార్క్ కామెంట్స్ చేసారు. గతంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లను శాంతియుతంగా నిర్వహించాం అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ పరిస్థితి చూశాం అంటూ వ్యాఖ్యానించారు.
ఇక హైడ్రా పై కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. హైడ్రా పేరుతో హైడ్రామాలు వద్దని ముఖ్యమంత్రికి చెబుతున్నాం అన్నారు. పేదల ఇళ్లను బుల్డోజర్ లతో కూలుస్తున్నారు అని హైద్రాబాద్ లో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వానికి మానవీయ కోణం ఉండాలి అని సూచించారు. ఒక శాఖ రిజిస్ట్రేషన్ చేస్తది…ఇంకో శాఖ వచ్చి కూలగొడుతుంది అని పర్మిషన్ లు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. హైడ్రా బాధితులకు మా పార్టీ ఆఫీస్ కు రండి…మా లీగల్ సెల్ అందుబాటులో ఉంటుంది అని స్పష్టం చేసారు.