TOP STORY : ఎకరం 100 కోట్లకు అమ్మారు..రియల్ ఎస్టేట్ ని ముంచారు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నాశనం అయిపోయిందని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుండెలు బాధ కుంటున్నాడు. జనం దగ్గర వ్యాపారుల దగ్గర ఒక్క రూపాయి కనిపించడం లేదని...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 13, 2024 | 12:54 PMLast Updated on: Nov 13, 2024 | 12:54 PM

Ktr Comments Over Real Estate Fall Down In Telangana

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నాశనం అయిపోయిందని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుండెలు బాధ కుంటున్నాడు. జనం దగ్గర వ్యాపారుల దగ్గర ఒక్క రూపాయి కనిపించడం లేదని… రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్లే మిగతా అన్ని వ్యవస్థలను నాశనం అయిపోయాయని చెప్పిందే పదిసార్లు చెప్పుకొని తిరుగుతున్నాడు కేటీఆర్. కానీ రియల్ ఎస్టేట్ ఎవరి వలన ఈ రోజు హైదరాబాదులో నాశనం అయింది,? ఎందుకు నాశనమైంది? దానికి కారణం ఎవరు అన్నది ఒక్కసారి పరిశీలించి చూస్తే నిజా నిజాలు అర్థం అవుతాయి.

రియల్ ఎస్టేట్ ఎదుగుదల మాత్రమే అసలు సిసలైన అభివృద్ధి అని కేటీఆర్, కెసిఆర్, హరీష్ రావులు మాత్రమే పదే పదే చెబుతూ ఉంటారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధికి కారణమైన రంగాల్లో రియల్ ఎస్టేట్ 20వ నెంబర్ లో ఉంటుంది. తెలంగాణలో భూములు విలువ విపరీతంగా పెరిగిపోయాయని, ప్రతి వాడు కోటీశ్వరుడు అయిపోయాడని కేటీఆర్ పదేపదే పాడిందే పాట పాచిపల్ల దాసరి లాగా చెప్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధి మాత్రమే నిజమైన అభివృద్ధ?. ఎవ్వరు కొనలేని స్థాయికి భూములు విలువ పెరగడం, అపార్ట్మెంట్లు విలువ సామాన్యుడికి అందుబాటులో లేకుండా విపరీతంగా పెరిగిపోవడం నిజమైన అభివృద్ధ? అభివృద్ధి అంటే దాని ఫలితాలు అందరికీ సమానంగా అందాలి. అంతేకానీ వంశీరాం బిల్డర్స్ రాజ్ పుష్ప, అపర్ణ, మై హోమ్, ఫినిక్స్, హానర్, వేర్టెక్స్, లాంటి సంస్థలు మాత్రమే సిటీలో అభివృద్ధి చెందడం కాదు. రియల్ ఎస్టేట్ సంస్థలు వేలకోట్ల రూపాయలు సంపాదించడం, పొలిటికల్ పార్టీలకు వందల కోట్లు ఫండింగ్ ఇవ్వడం…. అదే అభివృద్ధని కేటీఆర్ అనుకుంటున్నారు. 50 వేల రూపాయలు జీతం వచ్చే సగటు ఉద్యోగి ఈరోజు హైదరాబాదులో కొత్త అపార్ట్మెంట్ కొనగలడా? ఇవాళ హైదరాబాదులో రెండు కోట్ల రూపాయలు పెడితే గాని 1200 ఎస్ ఎఫ్ టి అపార్ట్మెంట్ కొనలేం. దీనికి కారణం కేటీఆర్.

రియల్ ఎస్టేట్ బిల్డర్ల కోసమే పదేళ్ల సంవత్సరాల పరిపాలన అంకితం చేసిన కెసిఆర్ ప్రభుత్వం ఒక సామాన్యుడికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 60… 70… లక్షలు రూపాయలకు ఇప్పించలేని పరిస్థితి సృష్టించింది.2014 వరకు హైదరాబాదులో నిర్మాణరంగం కంట్రోల్లో ఉండేది.2014 తర్వాత కేటీఆర్ ,కెసిఆర్ హయాంలో సిటీలో అడ్డగోలుగా నిర్మాణాలకు, 50 అంతస్తుల బిల్డింగులకు అనుమతులు ఇచ్చారు. కోట్ల రూపాయల లంచాలు తీసుకొని హైదరాబాదులో ఒకే చోట 40 ..50 అంతస్తులకు… అనుమతిలిచ్చి…. నిర్మాణాలు చేయించి విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోవడానికి కారణం కేటీఆర్. రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అయిపోయిందని…… చేతిలో నాలుగు డబ్బులు లేవని కేటీఆర్ ఇప్పుడు విపరీతంగా బాధపడిపోతున్నాడు. తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల ప్రజలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లేదు. రాజకీయ నాయకులు, వ్యాపారులు, బిల్డర్లు, పవర్ బ్రోకర్లు మాత్రమే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. మిగిలిన ప్రజలంతా వాళ్ల వాళ్ల వృత్తుల్లో, ఉద్యోగాల్లో వాళ్లకు తగినట్లుగా జీవిస్తున్నారు. ఈరోజు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ రంగం కుదేల్ అయిపోవడానికి పరోక్షంగా ఆనాడు కెసిఆర్ ప్రభుత్వం తీసుకుని నిర్ణయాలే కారణం. అవసరానికి మించి విపరీతంగా అనుమతులు ఇచ్చి నిర్మాణాలు చేయించారు.

టిఆర్ఎస్ లో మూడు వంతులు మంది నాయకులు రియల్ ఎస్టేట్ బిల్డర్లే. ఆ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి ఫిలింనగర్ లో రామానాయుడు స్టూడియో పక్కన నాలుగున్నర ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా చేసి 15 ఎకరాల్లో హైదరాబాదులోనే అత్యంత అపార్ట్మెంట్లు కట్టాడు. ఒకప్పుడు ఆ పార్టీ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ దగ్గరే అనుమతులు తీసుకొని రాఘవ కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేశారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల్లో సగానికి పైగా రియల్ ఎస్టేట్ తో సంబంధం ఉన్నవాళ్లే. ఇక వంశీరాం బిల్డర్స్, రాజ్ పుష్ప, మై హోమ్, అపర్ణ, ఫినిక్స్, హానర్ లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలతో కేటీఆర్ కు, కవితకు వాళ్ల బంధువులకు ఎంత దగ్గర సంబంధం ఉందో జనం అందరికీ తెలుసు. గుట్టలబేగంపేటలో 50 ఎకరాల ప్రొహిబిటెడ్ ల్యాండ్ ఫినిక్స్ సంస్థకి కట్టబెట్టింది ఎవరు? అలాగే వంశీరాం బిల్డర్స్ కి అడ్డగోలుగా భూములను అప్పగించింది ఎవరు? కెసిఆర్ కేటీఆర్ కాదా? నిర్మాణాలకు విపరీతంగా అనుమతులు ఇచ్చి…. అవసరానికి మించి నిర్మాణాలు చేయించి అవి ఇప్పుడు జనం కొనకపోతే రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది అంటూ గగ్గోలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అంతేకాదు 111 జీవో భూముల్లో వందల ఎకరాలు ముందే కొనిపెట్టుకొని ఆ తర్వాత జీవో ఎత్తేస్తున్నట్లు ప్రకటించి రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభం సృష్టించింది కేసీఆర్ కేటీఆర్. హైదరాబాద్ జనంలో చాలామంది త్రిబుల్ వన్ జీవో భూముల్లో పెట్టుబడులు పెట్టి అక్కడ 500 గజాలు… 1000 గజాలు స్థలాలు కొనుక్కున్నారు. ఎప్పటికీ లేదు. ఆ జీవో ఎత్తేయడం అసాధ్యం. కెసిఆర్ ని నమ్మి అక్కడ స్థలాలు కొని వందల వేలమంది అన్యాయం అయిపోయారు. దాని ఎఫెక్ట్ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై పడింది.

హైదరాబాద్, తెలంగాణ రియల్ ఎస్టేట్ 2023 ఎన్నికలకు రెండేళ్ల ముందే కుదేలు అయిపోయింది. అంతేకాదు ప్రతి ఎన్నికల సంవత్సరం రియల్ ఎస్టేట్లో స్తబ్దత వస్తుంది. ఏడాది తర్వాత అది మళ్లీ సర్దుకుంటుంది. ఇది ప్రపంచ దేశాల్లో అన్నిచోట్ల జరిగేది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కోవిడ్ తర్వాత బాగా దెబ్బతింది. ఆ తర్వాత మరింత దిగజారింది. కానీ రియల్ ఎస్టేట్ బిల్డర్ లతో కెసిఆర్ కుటుంబం కు మ్మక్కై చేసిన అతి పెద్ద స్కాం ఈరోజు ఆ రంగం కునారీల్లి పోవడానికి కారణం. హైదరాబాదులో ఓ ఆర్ ఆర్ పక్కన ఎకరం 100 కోట్లకు అమ్మింది ఎవరు? కొన్నది ఎవరు? నిజంగా ఎకరం 100 కోట్లకు ప్రభుత్వమే అమ్మాల్సిన అవసరం ఉందా.? కెసిఆర్ సర్కార్ రాజ్ పుష్ప రియల్ ఎస్టేట్ సంస్థతో కుమ్మక్కై , ముందే మాట్లాడుకుని వేలంలో ఎకరం 100 కోట్లకు అమ్మింది. దాంతో ఆర్టిఫిషియల్ రియల్ ఎస్టేట్ భూమ సృష్టించాడు కేటీఆర్. ఎకరం 100 కోట్లకు వెళ్ళగానే ఆ స్థలం చుట్టూ ఉన్న భూములన్నీ రేట్లు పెరిగి పోయాయి. ఎకరం 100 కోట్లకు ఒక బిల్డర్ స్థలం కొంటే ఒక త్రిబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ ఎంతకమ్మాలి. ?ఈరోజు కోటి రూపాయలు విలువ చేయని త్రిబుల్ బెడ్ రూమ్ హైదరాబాదులో రెండున్నర కోట్లకు పెరిగిపోవడానికి ప్రధానమైన కారణం కెసిఆర్ ప్రభుత్వమే బిల్డర్లతో కుమ్మక్కై వేలంలో భూముల రేట్లు ఎక్కువ కి పాడించి… తద్వారా మిగిలిన భూములు అన్నింటికీ విలువలు పెంచి… సాధారణ ధరకు అపార్ట్మెంట్లు సామాన్యులకు అందకుండా చేశారు. నిజానికి మంచి నాణ్యమైన నిర్మాణం చేస్తే ఎస్ ఎఫ్ టి 3000 రూపాయలు పడుతుంది.

దానిని బిల్డరు అన్ని ఖర్చులు కలుపుకొని 5 వేల రూపాయలకు అమ్మితే 2000 ఎస్ ఎఫ్ టి అపార్ట్మెంట్ కోటి రూపాయలకు కొనుక్కోవచ్చు. కానీ కేటీఆర్ రియల్ ఎస్టేట్ సంస్థలతో కుమ్మక్కై చేసిన దారుణాలు ఈరోజు హైదరాబాదులో అపార్ట్మెంట్ రేట్లు సామాన్యుడికి అందుబాటులోకి రాకుండా చేశాయి. దీంతో తప్పనిసరి అయితే తప్పించి ఎవ్వరు అపార్ట్మెంట్ల కొనడం లేదు. హైదరాబాదుకు గడచిన మూడేళ్లలో కొత్త కొత్త కంపెనీలు ఏమి వచ్చి పడిపోలేదు. ఏపీలో జగన్ సర్కార్ తీసుకున్న దిక్కుమాలిన నిర్ణయాల వలన అక్కడ జనం కూడా వచ్చి హైదరాబాదులో పెట్టుబడులు పెట్టారు. స్థలాలు అపార్ట్మెంట్లు కొన్నారు. అంతేతప్ప ఇక్కడ ప్రతి వాడు ఒకటికి నాలుగు అపార్ట్మెంట్లు పోనీ పక్కన పడేసుకోవట్లేదు.2014 నుంచి హైదరాబాద్ ఎంతోకొంత అభివృద్ధి చెందిన మాట వాస్తవం. దాన్ని ఎవరు కాదనలేదు. అయితే కేటీఆర్ రియల్ ఎస్టేట్ బిల్డర్ లతో కుమ్మక్కై సృష్టించిన ఆర్టిఫిషియల్ బూమ్ ఎన్నికలు అయిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు అయిపోయేలా చేసింది .అవన్నీ దాచిపెట్టి ఇప్పుడు కేటీఆర్ గుండెలు కొట్టుకుంటున్నాడు. బిల్డర్లకు చదరపు అడుగు 10000 రూపాయలు…15వేల రూపాయలు అమ్మమని ఎవరు చెప్పారు.? బిల్డర్లు ఆ ధర ఎలా నిర్ణయించారు? రియల్ ఎస్టేట్ బిల్డర్లపై ప్రభుత్వానికి కంట్రోల్ ఎందుకు పోయింది? అసలు వాళ్ళ రేటుని ఎవరు డిసైడ్ చేశారు? ఎస్ ఎఫ్ టి 6 వేల రూపాయల లోపు అమ్మ గలిగితే సేల్స్ ఆటోమెటిగ్గా అవే పెరుగుతాయి. ఇష్టం వచ్చిన రేటుకి, వందల కోట్ల రూపాయలకి భూములు కొని ఆ భారాన్ని కస్టమర్ల మీద వేసి ఎస్ ఎఫ్ టి పదివేలు నుంచి 15 వేల రూపాయలకు కు అమ్మితే సామాన్యులు ఇల్లు ఎలా కొనుక్కుంటారు.? ఈరోజు హైదరాబాదులో సామాన్యుడికి సొంత డబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ అందుబాటులో లేకపోవడానికి ప్రధాన కారణం ఆనాడు కేటీఆర్ రియల్ ఎస్టేట్ సంస్థలు కలిసి సృష్టించిన ఆర్టిఫిషియల్ బూమ్ .