KTR on Media: 16 మీడియా సంస్థలపై KTR ఫ్యామిలీ కేసులు !

మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర నుంచి యూట్యూబ్ ఛానెళ్ళ దాకా అందర్నీ హెచ్చరించారు. కోర్టులకు లాగుతామని X లో ట్వీట్ చేశారు. ఆయన వార్నింగ్ ఇచ్చి ఒక్క రోజు కాకముందే.. 16 మీడియా సంస్థలకు నోటీసులు వెళ్ళాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2024 | 05:50 PMLast Updated on: Mar 26, 2024 | 5:50 PM

Ktr Family Member Filed Cases Against Media Notice Issued

KTR on Media: మా మీద తప్పుడు కథనాలు రాస్తే కేసులు పెడతాం.. కోర్టుకు లాగుతాం.. ఎవరైనా సరే.. వదిలే సమస్యే లేదు.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర నుంచి యూట్యూబ్ ఛానెళ్ళ దాకా అందర్నీ హెచ్చరించారు. కోర్టులకు లాగుతామని X లో ట్వీట్ చేశారు. ఆయన వార్నింగ్ ఇచ్చి ఒక్క రోజు కాకముందే.. 16 మీడియా సంస్థలకు నోటీసులు వెళ్ళాయి.

IPL TICKETS: బ్లాక్‌ మార్కెట్‌లో ఐపీఎల్ టికెట్స్‌.. ఒక్కోటి ఎంతంటే..

KTR బావమరిది రాజేంద్ర ప్రసాద్ లీగల్ నోటీసులు పంపారు. హైదరాబాద్ రాడిసన్ పబ్ కేసులో తనపై తప్పుడు వార్తలు రాశారంటూ 16 మీడియా సంస్థలపై KTR బావ మరిది రాజేంద్ర ప్రసాద్ లీగల్ నోటీసులు పంపారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో BRS నేతలతో పాటు కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ప్రమేయం ఉన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు దీనిపై రియాక్ట్ అయిన కేటీఆర్ బావమరిది మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానెళ్ళకు లీగల్ నోటీసులు ఇచ్చారు. BRS పార్టీ, కేసీఆర్ కుటుంబంపై వరుసగా మీడియాలో కథనాలు ప్రసారం అవుతుండటంతో కేటీఆర్ సీరియస్‌గా ఉన్నారు. కాళేశ్వరం అవినీతి, విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు, ఢిల్కీ లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్, భూముల కబ్జా.. ఇలా రోజుకో కుంభకోణంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు వినిపిస్తున్నాయి.

దాంతో గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దీనికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశ్యంతో లీగల్ చర్యలు దిగుతున్నారు. జూబ్లీహిల్స్ భూకబ్జా కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుపై కేసు నమోదు కావడంతో ఆయన కూడా సీరియస్ అయ్యారు. తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. సంతోష్ రావుపై నవయుగ కంపెనీ కేసు కూడా పెట్టింది.