లొట్టపీసు కేసు.. తిప్పి తిప్పి పిప్పి చేసారు: కేటిఆర్

మాజీ మంత్రి కేటిఆర్ ను ఏసీబీ అధికారులు విచారించారు. దాదాపు ఏడు గంటల పాటు ఈ విచారణ జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటిఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 9, 2025 | 07:35 PMLast Updated on: Jan 09, 2025 | 7:35 PM

Ktr Fire On Cm Revanth Reddy

మాజీ మంత్రి కేటిఆర్ ను ఏసీబీ అధికారులు విచారించారు. దాదాపు ఏడు గంటల పాటు ఈ విచారణ జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటిఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఏసీబీ వాళ్ళు రేవంత్ రాసిచ్చిన 85 ప్రశ్నలు అడిగారని అడిగిందే మళ్ళీ అడిగారన్నారు. ఫార్ములా e రేస్ ద్వారా హైదరాబాద్ ఇమేజ్ పెంచామని రేవంత్ లా గలీజ్ పనులు మేము చేయలేదు అని..ఏసీబీ వాళ్లకు చెప్పాను అంటూ మండిపడ్డారు.

ఎన్ని సార్లు రమ్మని చెప్పిన వస్తా అని చెప్పినా… ఎన్ని కేసులు పెట్టిన ఇస్తానని మోసం చేసిన హామీల గూర్చి మాట్లాడుతాం అని హెచ్చరించారు. ఇది లొట్టపిసు కేసు అని సెటైర్లు వేసారు. నేను జైల్ కి వెళ్లిన అందరిని పంపాలి అని రేవంత్ ఆలోచన చేస్తున్నారని రేవంత్ కి బీఆర్ఎస్ నాయకులు ఎవరు భయపడరన్నారు. ముఖ్యమంత్రిని ఎవరు గుర్తు పట్టడం లేదు.. అందుకే కోపం ఇలా చూపిస్తున్నాడని లొట్టపిసు కేసు.. లొట్టపిసు ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేసారు.