షర్మిల మాట విను రేవంత్: కేటిఆర్ ఫైర్
అదానీ విషయంలో కాంగ్రెస్.. ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా మాట్లాడుతుంది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఫైర్ అయ్యారు. అదానీ అవినీతిపరుడైతే.. రేవంత్ రెడ్డి నీతిపరుడు ఎలా అవుతోడు? రాహుల్ గాంధీ చెప్పాలి అని ఆయన సవాల్ చేసారు.
అదానీ విషయంలో కాంగ్రెస్.. ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా మాట్లాడుతుంది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఫైర్ అయ్యారు. అదానీ అవినీతిపరుడైతే.. రేవంత్ రెడ్డి నీతిపరుడు ఎలా అవుతోడు? రాహుల్ గాంధీ చెప్పాలి అని ఆయన సవాల్ చేసారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే.. తెలంగాణ సర్కార్ అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయించాలి అని డిమాండ్ చేసారు. కెన్యా లాంటి చిన్న దేశాలే రద్దు చేసుకున్నప్పుడు.. రేవంత్ రెడ్డి ఎందుకు రద్దు చేసుకోడు? అని ప్రశ్నించారు. అదానీతో ఒప్పందాలపై పునరాలోచన చేయాలని షర్మిల సైతం అంటున్నారన్నారు కేటిఆర్.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సూచన రేవంత్ రెడ్డి తీసుకోవాలని సూచించారు. మహారాష్ట్ర వెళ్ళి అదానీని గజదొంగ అని మాట్లాడిన రేవంత్.. తెలంగాణలో మాత్రం గజ మాల వేస్తున్నాడని మండిపడ్డారు. అదానీతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలపై తెలంగాణ బీజేపీ వైఖరి చెప్పాలి అని డిమాండ్ చేసారు. అదానీ వ్యవహరంతో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని మరోసారి రుజుమైందన్నారు కేటిఆర్. మోదీ, అమిత్ షా, రాహుల్, రేవంత్, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన కేటిఆర్ అదానీతో దేశానికి నష్టమైతే.. తెలంగాణకు నష్టం కాదా? రాహుల్ గాంధీ చెప్పాలన్నారు.
స్కిల్ యూనివర్శిటీకి వంద కోట్లు తీసుకోవడం తప్పా? కాదా? అని ప్రశ్నించారు. కోహినూరు హోటల్లో మంత్రి పొంగులేటి, అదానీ రహస్య సమావేశం అయిన మాట వాస్తవమన్నారు. అదానీతో ఒప్పందాలు రేవంత్ సర్కార్ రద్దు చేసుకోవటం లేదు ఎందుకు అని ప్రశ్నించారు. అదానీ వేల కోట్లు ఒప్పందాలపై.. రోజూ విమర్శించే రాహుల్ గాందీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. రాహుల్ గాంధీకి తెలిసే విరాళం రేవంత్ రెడ్డి తీసుకున్నారా? అని ప్రశ్నించారు. జాతీయపార్టీకి ఢిల్లీలో ఒక నీతి .. గల్లీలో మరొక నీతి అని మండిపడ్డారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే.. కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్ పార్టీనా? అని నిలదీశారు.