రేయ్ రేవంత్ ఊరికిచ్చి కొడతారు: కేటిఆర్ సంచలన కామెంట్స్
మానుకోట పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ఉద్యమంలో మలుపుకు కారణమైంది ఈ మానుకోట...
మానుకోట పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ఉద్యమంలో మలుపుకు కారణమైంది ఈ మానుకోట… ఇప్పుడు నియంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడలు వంచేందుకు సిద్ధమైంది ఈ గడ్డ అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. స్వంత నియోజకవర్గంలో తిరుబాటు ఎదురుకుంటున్న సిఎం రేవంత్ అని మండిపడ్డారు. అక్కడికి రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి కొడతారని సంచలన వ్యాఖ్యలు చేసారు.
మీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకిలించేదాకా వదిలి పెట్టమని హెచ్చరించారు. అల్లుడి కోసం, అన్న కోసం తప్ప రాష్ట్ర ప్రజల కోసం రేవంత్ రెడ్డి పని చేస్తలేడని మండిపడ్డారు. మహారాష్ట్రలో తన్నులు తిన్నడని ఎద్దేవా చేసారు. అక్కడ రేవంత్ మోసాలు నమ్మలేదు.. తన్ని తరిమారన్నారు. రాష్ట్రంలో ఉన్న డీజీపీ నీ అడుగుతున్న… మమల్ని రాళ్లతో కొడతాం అంటే కాంగ్రెస్ ఎంఎల్ఏ లపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. మానుకోట రాళ్ళ మహత్యం ఏంటో తెలుసుకోండన్నారు. మానుకోట మొదటి అడుగని అన్నారు. రాష్ట్రం అంతటా కొడంగల్ గిరిజనులకు మద్దతు కూడగడతాం అని స్పష్టం చేసారు.