రేవంత్ నాశనం అయిపోతావ్… చర్లపల్లి జైల్లో కేటిఆర్
లగచర్ల ఘటన నిందితులను జైల్లో పరామర్శించిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.
లగచర్ల ఘటన నిందితులను జైల్లో పరామర్శించిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. పేద గిరిజన దళిత బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి ఈరోజు జైలు పాలయ్యాడు పట్నం నరేందర్ రెడ్డి అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. పట్నం నరేందర్ రెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.
ఆయన మాతో ఒకే విషయాన్ని ప్రస్తావించారు… నా గురించి వదిలేయండి.. చేయని తప్పుకు జైల్లో ఉన్నటువంటి 30 మంది రైతులను విడిపించండి అని పట్నం నరేందర్ రెడ్డి కోరారన్నారు. గిరిజన దళిత రైతుల భూములను గుంజుకుంటున్నారు వారికి అండగా నిలవండని కోరారన్నారు. సంగారెడ్డి జైలు నుంచి మొదలుపెడితే చర్లపల్లి జైలు దాకా అమాయకులు జైల్లో ఉన్నారన్న ఆయన కొడంగల్ నుంచి కొండ రెడ్డి పల్లి దాకా అరాచకాలు చేస్తున్నవారు గద్దెకి కూర్చున్నారని మండిపడ్డారు.
భూములు ఇవ్వకపోతే అర్ధరాత్రి ఇళ్లల్లో చొరబడి ఆడవాళ్లు ,చిన్నపిల్లలు అని తేడా లేకుండా అరాచకాలు చేస్తోంది ఈ ప్రభుత్వం అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సొంత ఊర్లో నిన్న సాయి రెడ్డి అనే మాజీ సర్పంచ్ మృతి చెందారని ఆరోపించారు. ఇంటిముందు దారి లేకుండా గోడలు కడితే మానసిక క్షోభ కి గురై ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. నా సొంత ఊరు నా సొంత నియోజకవర్గము అని ఇష్టం వచ్చినట్లు చేస్తే ప్రజలు చూస్తూ ఉండరని హెచ్చరించారు. నువ్వు చక్రవర్తివి కాదు.. నువ్వు కూడా కొట్టుకొని పోతావన్నారు. పేదవారి భూములను లాక్కుంటే ఊరుకోము మీ వెనక కేసీఆర్ అండగా ఉన్నారున్నారు.