2047 Vision Hyderabad : తెలంగాణలో ఎక్కడికైనా గంటలోనే.. కొత్త ప్రాజెక్ట్ ప్రతిపాదించిన కేటీఆర్
తెలంగాణకే తలమాణికం మన రాజధాని హైదరాబాద్. రోజూ కొన్ని వేల మంది ఇక్కడికి ఉపాధి కోసం వస్తుంటా. ప్రతీ జిల్లాలో గ్రాడుయేషన్ పూర్తి చేసుకున్న నిరుద్యోగి.. మొదట చూసేది హైదరాబాద్ వైపే. అలాంటి హైదరాబాద్‌ను తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రతిపాదన చేశారు ఐటీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నుంచి తెలంగాణలో ఏ ప్రాంతానికైనా కేవలం గంటలోనే చేరుకునే విధంగా రాపిడ్ రైల్ సర్వీస్‌ను ఆయన ప్రతిపాదించారు.
తెలంగాణకే తలమాణికం మన రాజధాని హైదరాబాద్. రోజూ కొన్ని వేల మంది ఇక్కడికి ఉపాధి కోసం వస్తుంటా. ప్రతీ జిల్లాలో గ్రాడుయేషన్ పూర్తి చేసుకున్న నిరుద్యోగి.. మొదట చూసేది హైదరాబాద్ వైపే. అలాంటి హైదరాబాద్‌ను తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రతిపాదన చేశారు ఐటీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నుంచి తెలంగాణలో ఏ ప్రాంతానికైనా కేవలం గంటలోనే చేరుకునే విధంగా రాపిడ్ రైల్ సర్వీస్‌ను ఆయన ప్రతిపాదించారు. 2047 హైదరాబాద్ విజన్ ప్రజెంటేషన్‌లో ఈ ప్రాజెక్ట్ గురించి వివరించారు. ఔటర్ రింగ్ రోడ్ వరకూ వరకూ మెట్రో సర్వీస్.. అక్కడి నుంచి ర్యాపిడ్ రైల్ సర్వీస్ ఏర్పాటు చేసి.. తెలంగాణలో ప్రతీ జిల్లాకు హైదరాబాద్‌ను దగ్గర చేసే ప్రణాళికను బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధం చేసిందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అందరికీ వివరించారు. మొదట శామీర్‌పేట్ ఓఆర్‌ఆర్ వరకూ మెట్రో నిర్మించి.. అక్కడి నుంచి గజ్వేల్, కొమురవెళ్లి, సిద్ధిపేట్, కరీంనగర్ వరకూ 140 కిలో మీటర్ల ర్యాపిడ్ రైలు సర్వీస్ ఉంటుందన్నారు. ఘట్‌కేసర్ ఓఆర్‌ఆర్ వరకూ మెట్రో.. అక్కడి నుంచి బీబీనగర్, యాదాద్రి, జనగాం, రఘునాథ్‌పల్లి, స్టేషన్ ఘన్‌పూర్ మీదురగా వరంగల్ వరకూ 113 కిలో మీటర్ల ర్యాపిడ్ రైల్ సర్వీస్ వస్తుందన్నారు.
Telangana Elections : 5 రోజుల్లో పోలింగ్.. KCRకు షాకిచ్చిన ఈసీ..
ఇక పెద్ద అంబర్‌పేట్ ఓఆర్‌ఆర్ నుంచి రెండు మార్గాల్లో ర్యాపిడ్ ట్రైన్ సర్వీస్ ఉంటుందన్నారు. ఓఆర్‌ఆర్ వరకూ మెట్రో అక్కడి నుంచి చౌటుప్పల్, చిట్యాల్, నార్కట్‌పల్లి మీదుగా నల్గొండ వరకూ 81 కిలో మీటర్ల ర్యాపిడ్ రైల్ సర్వీస్, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట్, కూసుమంచి మీదుగా ఖమ్మం వరకూ 111 కిలో మీటర్ల మరో ర్యాపిడ్ రైల్ సర్వీస్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇక శంషాబాద్ ఓఆర్‌ఆర్ నుంచి షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్ వరకూ 50 కిలో మీటర్ల ర్యాపిడ్ సర్వీస్ తీసుకురావొచ్చన్నారు. అప్పా ఓఆర్‌ఆర్ నుంచి మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, వికారాబాద్ వరకూ 60 కిలో మీటర్ల సర్వీస్.. ముత్తంగి ఓఆర్‌ఆర్ నుంచి ఇస్నాపూర్, సంగారెడ్డి, సదాశివపేట్, జహీరాబాద్ వరకూ 64 కిలో మీటర్ల సర్వీస్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్దం చేశామన్నారు. ఇక కండ్లకోయ ఓఆర్‌ఆర్ నుంచి రెండు మార్గాల్లో సర్వీస్‌లు ఉంటాయని చెప్పారు. మేడ్చల్, మనోహరాబాద్, మూసాయిపేట, చేగుంట, మెదక్ వరకూ 70 కిలో మీటర్ల సర్వీస్.. చేగుంట నుంచి రామాయంపేట, బిక్‌నూర్, కామారెడ్డి, డిచ్‌పల్లి, నిజామాబాద్ వరకూ 103 కిలో మీటర్ల దూరం ఓక సర్వీస్ ఉంటుందన్నారు. మొత్తం ఏడు మార్గాల్లో 792 కిలో మీటర్ల మేర ఈ ప్రాజెక్ట్ విస్తరిస్తుందని వివరించారు. గంటకు 140 నుంచి 160 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే ర్యాపిడ్ రైళ్లను ఈ ప్రాజెక్ట్‌లో ఉపయోగించాలని చెప్పారు. ఐటీ రంగాన్ని చిన్న పట్టణాలకు విస్తరించేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.