మోడీ చెప్తేనే గవర్నర్ సంతకం, రాహుల్ ఎక్కడ సచ్చిండు…?
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మూసి బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ కాదు, లూటీఫికేషన్ ప్రాజెక్ట్ అంటూ ప్రసంగం మొదలుపెట్టిన కేటిఆర్... శాసన సభలో ఎటువంటి చర్చ లేకుండా హైడ్రా పై ఆర్డినెన్స్ తెచ్చారు అని కేంద్ర పెద్దల కనుసన్నల్లో గవర్నర్ సంతకం పెట్టాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మూసి బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ కాదు, లూటీఫికేషన్ ప్రాజెక్ట్ అంటూ ప్రసంగం మొదలుపెట్టిన కేటిఆర్… శాసన సభలో ఎటువంటి చర్చ లేకుండా హైడ్రా పై ఆర్డినెన్స్ తెచ్చారు అని కేంద్ర పెద్దల కనుసన్నల్లో గవర్నర్ సంతకం పెట్టాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. హైడ్రాకు కేంద్ర పెద్దల మద్దతు ఉందన్నారు. మూసి సుందరీకరణ ప్రాజెక్టు రిపోర్ట్ ప్రభుత్వం దగ్గర లేదని నేను అసెంబ్లీలో కూడా అడిగిన…ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేదన్నారు.
ముఖ్యమంత్రికి మోడీకీ వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయమన్న రేవంత్… మూసి రీ డెవలప్మెంట్ కాంగ్రెస్ పార్టీకి రిజర్వ్ బ్యాంకు కాబోతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నాడు అసెంబ్లీలో మూడు గంటల పాటు వివరణ ఇచ్చాడని మూసి సుందరీకరణ పై ప్రభుత్వంలో ఉన్నవారికి తెలియదన్నారు. త్వరలో మూసి పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికీ , మంత్రులకు సయోధ్య లేదన్నారు కేటిఆర్. లక్ష యాభై వేల కోట్లతో మూసి సుందరీకరణ చేస్తామని రేవంత్ రెడ్డి గోపనపల్లిలో మాట్లాడాడని… 10 నెలలు అవుతున్న మంత్రివర్గ విస్తరణ చెయ్యలేదన్నారు.
23 సార్లు ఢిల్లికీ వెళ్లిన రేవంత్ రెడ్డి 23 పైసలు రాష్ట్రానికి తేలేదని ఆరోపించారు. వరద బాధితులకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. 55 కిలో మీటర్ల మూసికీ కిలో మీటర్ కు 2700 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఒక్కటే అడుగుతున్నారు… వరదలు వచ్చినప్పుడు మాకు ఎటువంటి ఇబ్బందీ రాలేదని మాట్లాడుతున్నారని మూసి పరివాహక ప్రాంత పేద వాళ్ళ ఇండ్లను FTL బఫర్ జోన్ లో ఉన్నాయి అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడని వారికి పర్మిషన్ ఎవరు ఇచ్చారో చెప్పాలి… వారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
మూసి సుందరీకరణ రాష్ట్రానికి ఏం లాభం….కాంగ్రెస్ పార్టీకి లాభం తప్పా రాష్ట్ర ప్రజలకు ఎటువంటి లాభం లేదని మండిపడ్డారు. లేక్ వ్యూ పెట్టాలంటే బిల్డర్లు బయపడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో చిన్న పిల్లొడు పిలిచిన వస్తానన్న రాహుల్ గాంధీ ఎక్కడ సచ్చిండు అంటూ ఫైర్ అయ్యారు. మూసి పరివాహక ప్రాంత ప్రజలు చచ్చిపోతుంటే రాహుల్ గాంధీకి కనపడడం లేదా అని నిలదీశారు.