దమ్ముంటే కొడంగల్ రా: కేటిఆర్ సవాల్
రేవంత్‌కి దమ్ముంటే లగచర్ల రావాలని డిమాండ్ చేసారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీరు రాలేరు.. నేనే కొడంగల్‌కి వస్తా అని సవాల్ చేసారు.
రేవంత్‌కి దమ్ముంటే లగచర్ల రావాలని డిమాండ్ చేసారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీరు రాలేరు.. నేనే కొడంగల్‌కి వస్తా అని సవాల్ చేసారు. రేవంత్‌కి దమ్ముంటే పోలీసులతో అడ్డుకోవద్దని డిమాండ్ చేసారు. కొడంగల్ వస్తాం, మీ సంగతి ఏంటో చూస్తామని హెచ్చరించారు. హామీలిచ్చి మాటతప్పితే నిలదీయాలన్నారు కేటీఆర్. వందశాతం రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశాను అన్నారు.
నా సవాల్‌కి రేవంత్ నుంచి స్పందన లేదు అని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన రైతుబంధు పైసలు బీఆర్ఎస్ కూడబెట్టినవే అన్నారు. రేవంత్ సర్కార్ ఒక్క రూపాయి రైతుబంధు ఇవ్వలేదన్నారు. వానాకాలం రైతుబంధు కూడా రేవంత్ బాకీ పడ్డారని ఎన్నికలు ఉన్నాయి కాబట్టే రైతుబంధు డ్రామా అని మండిపడ్డారు కేటీఆర్. ఎన్నికలు అయిపోయాక కాంగ్రెస్ వాళ్లు దొరకరన్నారు. ఎకరాకు రూ.17,500 ఇచ్చే వరకు వదిలిపెట్టొద్దని, తులం బంగారం ఏమైందని మహిళలు నిలదీయాలన్నారు.