రేవంత్ ఏ పార్టీ సీఎం…? కేటిఆర్ సంచలన కామెంట్స్

వసూళ్ళ కోసమే రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకొచ్చిందని మాజీ మంత్రి కేటిఆర్ ఆరోపణలు చేసారు. హైడ్రాను అడ్డు పెట్టుకుని బిల్డర్లు, వ్యాపారవేత్తల నుంచి రేవంత్ సర్కార్ వసూళ్ళకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. హైడ్రా పేరుతో వసూలు జరుగుతున్నాయని ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ నేతలను కొట్టారన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 16, 2024 | 01:18 PMLast Updated on: Oct 16, 2024 | 1:18 PM

Ktr Sensational Comments On Revanth Reddy

వసూళ్ళ కోసమే రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకొచ్చిందని మాజీ మంత్రి కేటిఆర్ ఆరోపణలు చేసారు. హైడ్రాను అడ్డు పెట్టుకుని బిల్డర్లు, వ్యాపారవేత్తల నుంచి రేవంత్ సర్కార్ వసూళ్ళకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. హైడ్రా పేరుతో వసూలు జరుగుతున్నాయని ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ నేతలను కొట్టారన్నారు. అఖిలపక్షం సమావేశం కాదు.. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలతో మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేసారు. పార్టీల అభిప్రాయాలు కాదు.. ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు.

సీఎం రేవంత్ బీజేపీలో ఉన్నారా లేక కాంగ్రెస్ ముఖ్యమంత్రినా? అని నిలదీశారు. ఉన్నట్లుంది రేవంత్ కు దేశరక్షణ గుర్తొచ్చింది. గతంలో ఆర్మీలో ఏమైనా రేవంత్ పనిచేశాడా? అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణమైతే.. నా ఫాంహౌస్ ను కొట్టేయొచ్చు అని సవాల్ చేసారు. పేదల కడుపు కొట్టకుండా మూసీ సుందరీకరణ చేసుకోవచ్చు అని సూచించారు. సంక్షేమ పథకాలకు లేని నిధులు హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలకు డబ్బులు ఎక్కడవి అని నిలదీశారు. మూసీకి పురిట్లోనే గండి కొట్టి.. హైదరాబాద్ వచ్చి సుందరీకరణ అంటున్నారు అన్నారు.

దామగుండం నేవీ రాడార్ స్టేషన్స్ ను అమెరికా, యూకే లాంటి దేశాలు వాడటం లేదని పర్యావరణ ప్రేమికుల సూచన మేరకు కేబీఆర్ పార్క్ చుట్టూ ప్లై ఓవర్స్ ఆలోచనను విరమించుకున్నామని తెలిపారు. దిక్కుమాలని పాలన వలన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని మండిపడ్డారు. సీఎం దివాలాకోరు మాటల వలనే అప్పు పుట్టడం లేదని మంత్రి తుమ్మల గుర్తుంచుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డంగా ఉంటారు అని కాంగ్రెస్ హాయాంలోనే అనుమతిలిచ్చి.. ఇప్పుడు కూల్చుతున్నాతని డిప్యూటీ సీఎంకు తెలియదా? అని నిలదీశారు. మోదీని చూస్తే.. రేవంత్ రెడ్డికి హడల్ అని ఎద్దేవా చేసారు.