Himanshu Rao: వారసుడొచ్చాడు.. మనవడి రాకతో ఫుల్ ఖుషీలో ఉన్న కేసీఆర్..
తెలంగాణకు పెద్ద పండగ కావడంతో అమెరికా నుంచి కేసీఆర్ మనవడు, కేటీఆర్ కొడుకు హిమాన్షు ఇంటికి వచ్చాడు. దీంతో వాళ్ల కుటుంబంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇవాళ ప్రగతి భవన్‌లో కనిపించిన ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ ఇన్నీ కావు.

Himanshu Rao: పండగ అంటే మరమాన్నం వండుకునేది కాదు. మన అనుకున్న పది మందితో కలిసి జరుపుకునేది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేది. దాన్నే అసలైన పండగ అంటారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ కుటుంబంలో ఇవాళ ఇదే సీన్ కనిపించింది. తెలంగాణకు పెద్ద పండగ కావడంతో అమెరికా నుంచి కేసీఆర్ మనవడు, కేటీఆర్ కొడుకు హిమాన్షు ఇంటికి వచ్చాడు. దీంతో వాళ్ల కుటుంబంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపించింది.
ఇవాళ ప్రగతి భవన్‌లో కనిపించిన ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ ఇన్నీ కావు. దసరా పండగ వేళ మనవడు ఇంటికి రావడంతో పెద్ద సార్ కూడా చాలా ఖుషీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్‌లో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయుధ, వాహన పూజ కూడా చేశారు. రీసెంట్‌గానే హిమాన్షు పై చదువుల కోసం అమెరికా వెళ్లాడు. కేటీఆర్ స్వయంగా వెళ్లి కొడుకును అమెరికాలో దింపి వచ్చాడు. రీసెంట్‌గా కొడుకును మిస్ అవుతున్నానంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా ట్విటర్‌లో పెట్టాడు.
అమెరికా వెళ్లిన తరువాత హిమాన్షు కూడా తన తాతను మిస్ అవుతున్నానంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఇలా ఒకరినొకరు మిస్ అవుతున్న టైంలో పండగ పూట అందరూ ఇలా కలుసుకోవడం వాళ్ల కుటుంబ సభ్యులకే కాదు.. ఆ కుటుంబాన్ని అభిమానించే వాళ్లు కూడా ఎంతో సంతోషాన్నిచ్చింది.