KTR Son Himanshu: కేసీఆర్‌ మనవడు హిమాన్షుపై ట్రోలింగ్స్‌.. ఇరకాటంలో పడిన కేసీఆర్‌…

హిమాన్షును ఇంటర్వ్యూ చేసేందుకు చానెల్స్‌ కూడా పోటీ పడుతున్నాయంటే.. అర్థం చేసుకోవచ్చు మనోడి క్రేజ్. ఇదంతా ఎలా ఉన్నా.. హిమాన్షు చేసి మంచి పని.. ఇప్పుడు కేసీఆర్‌ టార్గెట్ అయ్యేలా చేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 13, 2023 | 02:01 PMLast Updated on: Jul 13, 2023 | 2:01 PM

Ktr Son Himanshu Trolled By Netizens Because Of This Reason

KTR Son Himanshu: కేసీఆర్‌ మనవడు హిమాన్షు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ కుటుంబం కాబట్టి.. ఎలాగోలా వార్తల్లో ఉంటున్నాడు ఈ మధ్య. హిమాన్షును ఇంటర్వ్యూ చేసేందుకు చానెల్స్‌ కూడా పోటీ పడుతున్నాయంటే.. అర్థం చేసుకోవచ్చు మనోడి క్రేజ్. ఇదంతా ఎలా ఉన్నా.. హిమాన్షు చేసి మంచి పని.. ఇప్పుడు కేసీఆర్‌ టార్గెట్ అయ్యేలా చేస్తోంది. మంచి పని ఇలా రివర్స్ అయిందేంటబ్బా అనుకుంటున్న పరిస్థితి ఇప్పుడు అందరిది.

గచ్చిబౌలిలోని ఓ ప్రభుత్వ స్కూల్‌కు దాదాపుగా కోటి రూపాయలు పెట్టి మరమ్మతులు చేయించాడు హిమాన్షు. అది అతడి సొంత డబ్బులు కాదు. తాను చదువుకున్న స్కూల్‌లో ఫండ్ రైజింగ్ చేశాడు. తాను కొంత వేశాడు. బీఆర్ఎస్ లీడర్ల సాయం తీసుకున్నాడు. స్కూల్‌లో అభివృద్ధి పనులు చేయించాడు. వాటిని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓపెన్ చేశారు. అక్కడ జరిగిన సభలో హిమాన్షు స్పీచ్ కూడా అదిరిపోయేలా ఇచ్చాడు. ఫస్ట్‌ పబ్లిక్ స్పీచ్‌లా కాకుండా.. అదేదో ఎక్స్‌పీరియన్స్‌డ్‌ లీడర్ ఇచ్చినట్లు అనిపించింది ప్రసంగం. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే, ఆ స్పీచ్‌లో హిమాన్షు చెప్పిన మాటలే ఇప్పుడు ట్రోలింగ్‌కు కారణం అవుతున్నాయి. కేసీఆర్‌ను కార్నర్ అయ్యేలా చేస్తున్నాయి. గచ్చిబౌలిలోని స్కూల్‌ పరిస్థితి చూసి తనకు కన్నీళ్లు వచ్చాయని అంటూ హిమాన్షు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విపక్షాలకు, నెటిజన్లకు ఆయుధంగా మారాయి. బంగారు తెలంగాణ అని కేసీఆర్‌ కుటుంబం చెప్పుకుంటున్న రాష్ట్రంలో స్కూళ్ల పరిస్థితి ఇదీ అంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేసీఆర్ మనవడే స్కూళ్ల దుస్థితి గురించి చెప్పారంటూ బీఆర్ఎస్‌ టార్గెట్‌గా విమర్శలు సంధిస్తున్నారు.

తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు దాటిపోయింది. ప్రభుత్వ స్కూళ్లలో కనీస సౌకర్యాలు కూడా మెరుగుపడలేదు. దాన్నే హిమాన్షు బయట పెట్టినట్లయింది.. ఇదీ బంగారు తెలంగాణలో పరిస్థితి అంటూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. ప్రభుత్వం నిజంగా దృష్టి సారించి ఉంటే.. ఈ స్కూల్‌కు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని, కేసీఆర్ పాలనకు ఇది నిదర్శనం అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా హిమాన్షు మంచి పని చేసినా.. అది బీఆర్ఎస్‌కు ఇబ్బందిగా మారింది. కేసీఆర్‌ను టార్గెట్ చేసేందుకు ఓ ఆయుధం అయింది. ఏదో అనుకుంటే ఇంకేదో అవడం అంటే ఇదేనేమో బహుశా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు చాలామంది.