రేవంత్ నిన్ను వదలను, కేటిఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

తనపై దాడికి ప్రయత్నం చేయడం పట్ల మాజీ మంత్రి కేటిఆర్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేసారు కేటిఆర్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 1, 2024 | 02:45 PMLast Updated on: Oct 01, 2024 | 2:45 PM

Ktr Strong Warning To Revanth Reddy

తనపై దాడికి ప్రయత్నం చేయడం పట్ల మాజీ మంత్రి కేటిఆర్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేసారు కేటిఆర్. గుండాలను పంపిన రేవంత్ రెడ్డికి కేటీఆర్ గట్టి హెచ్చరిక అంటూ… నా ప్రజలకు అండగా నిలబడడాన్ని నువ్వు ఆపలేవు అంటూ వార్నింగ్ ఇచ్చారు. మీ తాటాకు చప్పుళ్ళకి భయపడేవాడిని కాదు రేవంత్‌ రెడ్డి, మీ తాట తియ్యడానికి వచ్చాను అంటూ ఫైర్ అయిపోయారు.

నీ పిల్లి కూతలకి భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ, ఉద్యమాల పిడికిలి ఇది గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చారు. బడుగు బలహీనుల గొంతులను నీ బుల్డోజర్లు తొక్కి పెట్టలేవన్నారు. నీ గుండ రాజ్యాన్ని… నియంతృత్వ పాలనను సవాలు చేసే నా స్ఫూర్తిని నీ గుండాలు ఆపలేరన్న కేటీఆర్… నీ గుండాలు నా వాహనంపై చేసియన దాడి నాకు మరింత శక్తిని ఇస్తుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.