KTR: పవర్ పోయినా.. పొగరు ఇంకా తగ్గలేదు.. కేటీఆర్‌పై మండిపడుతున్న నెటిజన్లు..
32 మెడికల్ కాలేజీలు మీ తాత సొమ్ముతో పెట్టారా..? అది జనం సొమ్ము. నువ్వు పెట్టకపోతే వేరేవాడు వచ్చి పెడతాడు. అదేదో మీ ఆస్తులు అమ్మి జనానికి దానం చేసినట్లు బిల్డప్ ఇస్తున్నావే'' అని కామెంట్ చేశారు కొందరు.
KTR: కేసీఆర్ 32 మెడికల్ కాలేజీలు పెట్టి పొరపాటు చేశారేమో.. అదే 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టి.. అసత్య ప్రచారాలను ఎదుర్కొని ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం అంటూ ఇటీవల కేటీఆర్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్ అవుతోంది. కేటీఆర్ అహంకార ధోరణిపై సోషల్ మీడియాలో జనం దుమ్మెత్తిపోస్తున్నారు. చింత చచ్చినా పులుపు చావలేదని.. ప్రజా తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చినా.. ఘోరంగా ఓడిపోయినా.. ఇంకా మీకు పొగరు తగ్గలేదా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఎన్నికలయిపోయిన నెలరోజుల తర్వాత ఇప్పుడు కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ”ఎన్నికల ఫలితాలపై సమీక్షిస్తుంటే ఆసక్తికరమైన విషయాలు అర్థం అవుతున్నాయ్.. వాటిలో ఒకటి ఏంటంటే కేసీఆర్ 32 మెడికల్ కాలేజీలు పెట్టడం కన్నా.. 32 ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుంటే వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకోగలిగి ఉండేవాళ్లం” అంటూ రాసుకొచ్చారు కేటీఆర్.
PONNAM PRABHAKAR: ఎమ్మెల్యే చిలిపి పని.. వివాదంలో మంత్రి పొన్నం..
దీన్ని కాంగ్రెస్ వాళ్లు పెద్దగా పట్టించుకోకపోయినా.. నెటిజన్లు మాత్రం కేటీఆర్ అహంకార ధోరణిపై మండిపడుతున్నారు. ”32 మెడికల్ కాలేజీలు మీ తాత సొమ్ముతో పెట్టారా..? అది జనం సొమ్ము. నువ్వు పెట్టకపోతే వేరేవాడు వచ్చి పెడతాడు. అదేదో మీ ఆస్తులు అమ్మి జనానికి దానం చేసినట్లు బిల్డప్ ఇస్తున్నావే” అని కామెంట్ చేశారు కొందరు. జనం తీర్పుని గౌరవించలేని వాడు ఇలాంటి డొంక తిరుగుడు సమీక్షలు చెప్పుకుంటాడని మరికొందరు విమర్శించారు. ”తెలంగాణ ఏర్పడక ముందు ఈక, తోక లేనివాడివి.. సొంతంగా పత్రికలు, చానల్స్ ఎక్కడినుంచి పెట్టావ్. అవి ఫేక్ పత్రికలు, ఫేక్ చానల్స్ కాదా.. వాటిని అడ్డం పెట్టుకొని వేలకోట్ల అవినీతికి పాల్పడలేదా.. ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోయలేదా.. పత్రికలు, చానల్స్ పెట్టడానికి మీకు వేల కోట్లు ఎక్కడినుంచి వచ్చాయి”.. ఇలాంటి ప్రశ్నలతో కేటీఆర్‌ని కుమ్మేశారు నెటిజన్లు. ఎన్నికలకు ఏడాదికి ముందే స్వయంగా కేటీఆర్ తెలంగాణలో 70 యూట్యూబ్ ఛానల్స్ కొనుగోలు చేసిన విషయాన్ని మరికొందరు గుర్తు చేశారు.
రకరకాల యూట్యూబ్ చానల్స్‌ని మీరే లక్షలు పోసి కొని.. మీకు అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా నడపలేదా.. ఎన్నికల్లో సోషల్ మీడియాని మొత్తం మీరు కంట్రోల్ చేయలేదా.. కోట్ల రూపాయలు కుమ్మరించి ప్రతిపక్ష నాయకులపై రకరకాల కథనాలు లేదా అల్లలేదా.. గురువింద గింజ తన కింద ఉన్న నలుపు గురించి తెలుసుకోదంట.. అలా ఉంది కేటీఆర్ వ్యవహారం. పదేళ్లపాటు మీడియాని మెడపై కాలేసి తొక్కి, స్వేచ్ఛ లేకుండా అణిచివేసి.. సోషల్ మీడియాలో రాసిన వారిపై రకరకాల కేసులు పెట్టి వేధించిన విషయాన్ని కేటీఆర్ మర్చిపోయినట్టున్నారు. కేటీఆర్ సారధ్యంలోనే బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ పనిచేసింది. 70కి పైగా యూట్యూబ్ ఛానల్స్‌ను స్వయంగా కేటీఆర్ కొన్నారు. ఇది మీడియాలో అందరికీ తెలుసు. ఆయన ప్రతి ఒక్కరికి కబుర్లు చెబుతున్నారు. ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా.. ఎకరం 100 కోట్ల రూపాయలకి కొనిపించి తెలంగాణలో ఆర్టిఫిషియల్ రియల్ ఎస్టేట్ భూమిని సృష్టించింది ఎవరు..? సామాన్యుడికి అందుబాటులో లేకుండా రియల్ ఎస్టేట్ ధరలు అమాంతంగా ఆకాశాన్ని అంటుకునేటట్లు చేసి దాన్ని అభివృద్ధిగా చెప్పుకున్నది ఎవరు.. ఇవన్నీ కేటీఆర్ మర్చిపోయారా అని జనం ప్రశ్నిస్తున్నారు.
KESINENI NANI: భారీ డైలాగ్‌లేస్తున్న కేశినేని నాని.. ఇంతకీ ఆయన టార్గెట్ ఎవరు ?
కేసీఆర్ సచివాలయం ఎందుకు రారు.. ఎందుకు సామాన్య జనాన్ని, నాయకుల్ని కలవరు.. వీటికి కేటీఆర్ దగ్గర స్పష్టమైన సమాధానం ఉందా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. 111 జీవో ఎత్తేస్తామంటూ ప్రకటనలు చేసి.. అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్లు వేల ఎకరాలు కొనుక్కునేటట్టు చేసి.. పనిలో పనిగా మీరు భూములు సంపాదించలేదా అని కూడా జనం సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. కేటీఆర్, కేసీఆర్, సంతోష్ రావు, హరీష్ రావుకు, వాళ్ల కుటుంబసభ్యులకు ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టే సామర్థ్యం ఎలా వచ్చింది..? బంజారాహిల్స్‌లో ఇల్లు ఎక్కడ నుంచి వచ్చింది..? కేటీఆర్ ఆదాయం అమాంతంగా ఎలా పెరిగింది..? కేటీఆర్ భార్యకు ప్రైవేట్ కంపెనీలో షేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి..? నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చేసిన దారుణాలు జనం మర్చిపోయారా..? ఆర్మూర్‌లాంటి చోట జీవన్ రెడ్డి అరాచకాలు గుర్తులేవా..? ఇవన్నీ మర్చిపోయి కేటీఆర్ సోషల్ మీడియాపై పడి ఎందుకు ఏడుస్తున్నారంట అంటూ నెటిజన్లు నిప్పులు చెరిగారు.