రేవంత్ నిన్ను వదలను బిడ్డ: కేటిఆర్

రాజన్న జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో ఈ నెల 29 న నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమ నిర్వహణపై బీ.ఆర్.ఎస్. పార్టీ జిల్లా స్థాయి సన్నాహక సమావేశానికి హాజరై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 26, 2024 | 06:02 PMLast Updated on: Nov 26, 2024 | 6:02 PM

Ktr Warning To Cm Revanth Reddy 2

రాజన్న జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో ఈ నెల 29 న నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమ నిర్వహణపై బీ.ఆర్.ఎస్. పార్టీ జిల్లా స్థాయి సన్నాహక సమావేశానికి హాజరై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అనంతరం ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆరు గ్యారంటీలలో ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాలు, అరాచకం బయట పెడుతాం ఎవరికి భయపడేది లేదని స్పష్టం చేసారు. తిరిగి అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. రేవంత్ రెడ్డి పదవి తుమ్మితే ఉడి పోయే పదవని ఎద్దేవా చేసారు.

ఎక్కడకి వెళ్ళినా రేవంత్ రెడ్డి కెసిఆర్ మీద తిట్ల దండకం చేస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఓట్లు, కెసిఆర్ మీద తిట్లు, పథకాలకు తూట్లని మండిపడ్డారు. కొడంగల్ కు వెళితే రేవంత్ రెడ్డిని ఉరికించి అక్కడి ప్రజలు కొట్టేవాళ్ళన్నారు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ ఉంటే వేములవాడలో యారాన్ డిపో ఏర్పాటు చేస్తున్నారు, బోడిగుండుకు దెబ్బ తాకితే మోకాలుకు మందు రాస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరకాలంలోనే వ్యతిరేకత ప్రజల్లో ఏర్పడిందని ఎప్పుడు ఎలెక్షన్ వస్తాదా కాంగ్రెస్ పార్టీ కి కర్రు కాల్చి వాత పెడుతమ అని ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యలు చేసారు. రానున్న రోజుల్లో కెసిఆర్ మాదిరిగా ఒక్కొక్కరు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.