నాదెండ్ల మనోహర్ పై కేటిఆర్ కామెంట్స్

సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మేము సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు. గతంలో సీఎం కిరణ్ కుమార్ కుమార్ రెడ్డిపై ఉల్లంఘన నోటీసు ఇస్తే చర్చకు వచ్చిందని ప్రోటోకాల్ సమస్యలను వివరించామన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 16, 2024 | 02:31 PMLast Updated on: Dec 16, 2024 | 2:31 PM

Ktrs Comments On Nadendla Manohar

సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మేము సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు. గతంలో సీఎం కిరణ్ కుమార్ కుమార్ రెడ్డిపై ఉల్లంఘన నోటీసు ఇస్తే చర్చకు వచ్చిందని ప్రోటోకాల్ సమస్యలను వివరించామన్నారు. లగచర్ల పై చర్చకు మేము స్పీకర్ ను అడిగామని తెలిపారు. బీఏసీ లో కూడా ఈ అంశం లెవనెత్తుతామన్నారు.

ఆర్బీఐ నివేదిక ప్రకారం 3.89 లక్షల కోట్లు ని స్పస్టత ఇచ్చిందని తెలిపారు. గతంలో సీఎం పై మేము ఉల్లంఘనానోటీసు ఇచ్చామన్నారు. దీని నాదెండ్ల మనోహర్ ఉల్లంఘన నోటీసు అడ్మిట్ చేశారని గుర్తు చేసారు. ఆర్ధిక విషయాల్లో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు స్పష్టత ఇవ్వాలని మేము కోరుతున్నామన్నారు. ఢిల్లీ పర్యటనతో ఢిల్లీ టూరిజం, జైలు పర్యాటకం బాగా ఉందన్నారు.