కుమారి ఆంటీ పెద్ద మనసు, సిఎంకు విరాళం చెక్
ఈ మధ్య కాలంలో పెద్దగా మీడియాలో కనపడని కుమారి ఆంటీ... సిఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర తళుక్కున మెరిసారు. సిఎం రేవంత్ రెడ్డికి 50 వేల వరద సహాయం చెక్ అందించారు.
హాయ్ నాన్నా బాగున్నారా… అంటూ ముసి ముసి నవ్వులతో రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన కుమారీ అంటీ… ఇప్పుడు ఓ సెలెబ్రెటీ. హైదరాబాద్ లో ఏ స్టార్ హోటల్ కు అంత ఫాస్ట్ గా ఇమేజ్ రాలేదు. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రీ, మటన్ కర్రీ, మటన్ ఫ్రీ, మటన్ హెడ్, బగార్ రైస్… అంటూ చివర్లో మీది మొత్తం థౌజండ్ అయింది రెండు లివర్లు ఎకస్ట్రా అంటూ కుమారీ ఆంటీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. హైదరాబాద్ వెళ్తే కుమారి అంటీ దగ్గర భోజనం చేయాల్సిందే అనే వరకు వెళ్ళింది. ఆ తర్వాత మీడియా కూడా ఆమెను బాగా హైలెట్ చేసింది.
పెయిడ్ ఇంటర్వ్యూలు చేసే యూట్యూబ్ చానల్స్ మొదటిసారి కుమారి ఆంటీ కోసం ఎదురు చూసాయి. ప్రముఖ చానల్స్ అన్నీ కుమారి ఆంటీ వెంట పడ్డాయి. ఇక కాలేజీల్లో ఏదైనా కార్యక్రమం జరిగితే కుమారి ఆంటీ స్టాల్ ఉండాల్సిందే. ఇలా అన్ని వర్గాలకు ఆమె బాగా దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే ఆర్ధికంగా కుమారి ఆంటీ క్రమంగా బలపడుతూ వచ్చారనే చెప్పాలి. ఆమె ఓ నెక్లస్ కొనడానికి జ్యూవెలరి షాప్ కి వెళ్తే అక్కడ జనాలు చూసి షాక్ అయ్యారు. భోజనం అమ్మి ఆ రేంజ్ లో ఆమె సంపాదించడం నిజంగా ఓ సంచలనమే.
ఓ చిన్న వీడియో కుమారి ఆంటీని బాగా ఫేమస్ చేసింది. ఈ మధ్య కాలంలో పెద్దగా మీడియాలో కనపడని కుమారి ఆంటీ… సిఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర తళుక్కున మెరిసారు. సిఎం రేవంత్ రెడ్డికి 50 వేల వరద సహాయం చెక్ అందించారు. ఇటీవల తెలంగాణాలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వరదలతో సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈ క్రమంలో సినిమా పరిశ్రమ నుంచి మొదలుకుని సామాన్యులు, వ్యాపారవేత్తలు అందరూ సాయం చేస్తున్నారు. ఇప్పుడు కుమారి ఆంటీ కూడా సాయం చేయడం హాట్ టాపిక్ అయింది. ఏదేమైనా కుమారి అంటీ సూపర్.