లేడీ టార్జాన్ ఆఫ్ ఇండియా మోడీ మెచ్చిన మహిళ ఈమె
ఇది ఒక లేడీ టార్జాన్ ఆఫ్ ఇండియా కథ. ప్రకృతి కోసం పుట్టిన ఓ వీర వనిత కథ.. చెట్లను కాపాడ్డమే ప్రాణంగా బతికే ఓ ధీర మహళ కత.

ఇది ఒక లేడీ టార్జాన్ ఆఫ్ ఇండియా కథ. ప్రకృతి కోసం పుట్టిన ఓ వీర వనిత కథ.. చెట్లను కాపాడ్డమే ప్రాణంగా బతికే ఓ ధీర మహళ కత. మనలో చాలా మందికి ప్రకృతి అంటే ఇష్టం ఉంటుంది. పర్యావరణాన్ని కాపాడాలనే ఆరాటం కూడా ఉంటుంది. అందుకే చాలా మంది ఇంట్లో చెట్లను పెంచుతుంటారు. పార్క్‌లకు, చెట్లను కాపాడే కార్యక్రమాలకు డొనేషన్లు కూడా ఇస్తుంటారు. కొందరైతే ఏకంగా పర్యావరణ కార్యకర్తలుగా మారి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే లేడీ మాత్రం ఏకంగా తన ప్రణాలు పనంగా పెట్టి 50 హెట్లార్ల అడవిని కాపాడింది. అందుకే ఆమెను అంతా లేడీ టార్జాన్ అంటున్నారు.
స్క్రీన్ మీద మీరు చూస్తున్న లేడీ పేరు జమున. మనందరికీ చెట్లంటే ఇష్టమే. కానీ జమునకు మాత్రం చెట్లంటే ప్రాణం. ఎవరైనా ప్రకృతి జోలికి వస్తే ప్రాణం తీయడానికి ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడదు. ఈమెది ఒడిశాలోని రాయిరంగపుర్. పెళ్లి తరువాత తన అత్తగారి ఊరు ఝార్ఖండ్‌లోని మాతుకంకు షిఫ్ట్ అయ్యింది. ప్రకృతి ఒడిలో సేద తీరుతోందా అన్నట్టుగా ఉంటుంది జమున వాళ్ల అత్తగారి ఊరు. అంతే.. ఆ ఊరితో అక్కడి ప్రకృతితో ఎంతో అనుబంధం పెంచుకుంది జమున. కానీ అప్పటికే ఆ అడవిని చాలా మంది దోచుకున్నారు. తమ లాభం కోసం చెట్లను నరికేవాళ్లు. ఇలా చాలా వరకూ చెట్లు నాశనమయ్యాయి. దీంతో అడవిని కాపాడ్డమే ధ్యేయంగా పెట్టుకుంది జమున. అడివిని కాపాడే ఉద్యమంలో తనకు సహకరించాలని ఇంట్లోవాళ్లను కోరింది. కానీ బయటి నుంచి ఉన్న ప్రమాదం కారణంగా ఆమెకు ఎలాంటి మద్దతు లభించలేదు. ఇంట్లో వాళ్ల సహకారం లేకపోయినా జమున తన పోరాటాన్ని ఆపలేదు.
వన సురక్ష సమితి పేరుతో ఓ గ్రూప్ ఏర్పాటు చేసింది. స్థానికంగా ఉండే మహిళలకు ప్రకృతి గొప్పతనాన్ని వివరించిన తన గ్రూప్‌లో చేర్చుకుంది. వాళ్లతో కలిసి అడవిని కాపాడేందుకు ఉద్యమం మొదలు పెట్టింది. ఈ ఉద్యమంలో జమున అనేక సమస్యలు ఎదుర్కుంది. స్మగ్లర్లు, నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడింది. ఆమెను చంసేస్తామంటూ చాలా మంది చాలా సార్లు బెదిరించారు కూడా. కానీ ఎలాంటి బెదిరింపులకు తన పోరాటాన్ని ఆపలేదు జమును. పైగా మరింత ఉధృతంగా ఉద్యమం నడిపింది. తనతో ఉండే మహిళకు కర్రసాము కత్తిసాము నేర్పింది. సామాజిక కార్యక్రమాలతోనే కాకుండా సాయుధ పోరాటంతో కూడా ప్రత్యర్థులపై పోరాడటం మొదలు పెట్టింది. దీంతో ఆమె మొదలుపెట్టిన ఆ ఉద్యమం చుట్టుపక్క గ్రామాలకు కూడా పాకింది.
ఇదంతా చేసినప్పుడు జమున వయసు కేవలం 18 ఏళ్లే. 18 ఏళ్ల వయసులోనే తన పోరాటంతో అడివికే అండగా నిలించింది జమున. కొంత కాలంలోనే వాళ్ల గ్రామంలో ఆమె మొదలు పెట్టిన ఉద్యమం చుట్టుపక్క గ్రామాలకు కూడా పాకింది. చాలా మంది ఆమెతో కలిసి పని చేయడం మొదలు పెట్టారు. మొదట్లో పదుల సంఖ్యలో ఉండే తన గ్రూప్.. అంతా చూస్తుండగానే వేలకు మారింది. ఇప్పుడు జమున స్థాపించిన వన సురక్ష సమితిలో 10 వేల మంది సభ్యులు ఉన్నారు. ప్రకృతిని కాపాడేందుకు జమున చేసిన సేవకు గానూ ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డ్ ఇచ్చింది. ఇదే కాకుడా దేశ విదేశీ అవార్డులు కూడా జమునకు వచ్చాయి. ఈమెను అంతా లేడీ టార్జాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు.