హిట్లర్ కంటే దారుణంగా చంద్రబాబు చస్తాడు: లక్ష్మీ పార్వతి
వైసీపీ సీనియర్ నేత లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఐటీడీపీ వారు ఎంతో దారుణంగా మహిళలపై కూడా పోస్టులు పెడుతున్నారని... తెనాలికి చెందిన గీతాంజలి వీరి పోస్టుల దెబ్బకు ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. హిట్లర్ లాంటి వారే దిక్కూమొక్కు లేకుండా చనిపోయారు...
వైసీపీ సీనియర్ నేత లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఐటీడీపీ వారు ఎంతో దారుణంగా మహిళలపై కూడా పోస్టులు పెడుతున్నారని… తెనాలికి చెందిన గీతాంజలి వీరి పోస్టుల దెబ్బకు ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. హిట్లర్ లాంటి వారే దిక్కూమొక్కు లేకుండా చనిపోయారు… అలాంటి పరిస్థితే టీడీపీ పెద్దలకు కూడా వస్తుందన్నారు ఆమె. ప్రజల కష్టసుఖాలను పట్టించుకోకుండా జనం మీద కేసులు పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. సోషల్ మీడియా వలనే చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతిని బయట పడుతుందన్నారు.
పచ్చమీడియా చెప్పిందే వేదం అనేలా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మాపై అత్యంత దారుణమైన పోస్టులు పెట్టారన్నారు. పేరుకే చంద్రబాబు సీఎం, నడిపేదంతా లోకేషే అని ఆరోపించిన ఆమె జగన్ ని ఎదుర్కొనే దమ్ములేక వైసీపి కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని నడపటం చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని మండిపడ్డారు. ఈనాడు అనేది బ్రోకర్ పేపర్ అంటూ ఆరోపించారు. పేపర్ అడ్డుపెట్టుకుని వేలాది ఎకరాలను కబ్జా చేశారు అని సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు, రామోజీరావు కలిసి ఎన్ని కుట్రలు పన్నారో నాకు తెలుసన్నారు లక్ష్మీ పార్వతి.
ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి నన్ను బూచిగా చూపించారని రామోజీ, చంద్రబాబు ఉన్మాదంతో వ్యవహరించి ప్రభుత్వాన్ని కూల్చారన్నారు. ఈనాడు పేపర్ కాదు, విష పుత్రిక అని ఆమె మండిపడ్డారు. మార్గదర్శి పేరుతో ప్రజల సొమ్ము కొల్లగొట్టారని విమర్శించారు. ఈనాడులో ఎన్నో దారుణమైన కార్టూన్లు వేసి ఉన్నాదాన్ని చాటుకున్నారన్నారు ఆమె. ఎన్టీఆర్ ని భార్యావిధేయుడుగా, వంటింటి కుందేలుగా కార్టూన్లు వేశారని ఎన్టీఆర్ ని పిచ్చోడిలా చిత్రీకరించి బొమ్మలు వేశారని మండిపడ్డారు. విజయమ్మ రాసిన లేఖను కూడా ఫేక్ అని టీడీపీ ట్విట్టర్ లో పెట్టారని ఆరోపించారు. చివరికి విజయమ్మ వీడియో చేసి పెట్టాల్సి వచ్చిందని నన్ను ఇంట్లో నుండి పంపించేకుట్రలు చేసిన సైకో చంద్రబాబు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.