Lasya Nanditha: ఎవరీ ఆకాశ్.. లాస్య మరణంతో ఏంటి సంబంధం..?
లాస్యతో పాటు కారులో ఉన్న ఆకాష్ అనే వ్యక్తి ఎవరు..? అతను ఎందుకు లాస్య కారులో ఉన్నాడు..? ఆ కారు అతను ఎందుకు డ్రైవ్ చేస్తున్నాడు..? రాత్రి పన్నెండున్నర నుంచి ఉదయం ఐదున్నర వరకు వాళ్లిద్దరు ఎక్కడికి వెళ్లారు..? ఏం చేశారు..?
Lasya Nanditha: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య యాక్సిడెంట్‌లో చనిపోవడం అందరినీ కలచివేస్తోంది. 2 నెలల క్రితం ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించి.. రాజకీయ జీవితంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సమయంలో ఊహించని విధంగా జరిగిన లాస్య మరణం చుట్టూ ఎన్నో అనుమానాలు కనిపిస్తున్నాయ్. ముఖ్యంగా లాస్యతో పాటు కారులో ఉన్న ఆకాష్ అనే వ్యక్తి ఎవరు..? అతను ఎందుకు లాస్య కారులో ఉన్నాడు..? ఆ కారు అతను ఎందుకు డ్రైవ్ చేస్తున్నాడు..? రాత్రి పన్నెండున్నర నుంచి ఉదయం ఐదున్నర వరకు వాళ్లిద్దరు ఎక్కడికి వెళ్లారు..? ఏం చేశారు..? ఇద్దరు గన్‌మెన్‌లని, ఎప్పుడూ ఉండే డ్రైవర్‌ని కూడా వదిలేసి లాస్య ఎందుకు వెళ్లింది..?
MLC KAVITHA: 26న కవిత అరెస్ట్ తప్పదా..? సీబీఐ నెక్ట్స్ స్టెప్ ఏంటి..?
ఈ ప్రమాదంలో లాస్య చనిపోవడం, ఆకాష్ బతికి బయటపడడం.. ఎన్నో అనుమానాలకు, ఆశ్చర్యానికి, ఆవేదనకు తావిస్తోంది. అసలు ఈ ఆకాష్ ఎవరు అనేది డయల్ న్యూస్ టీం వెలికితీసింది. ఆకాష్ చిన్నప్పటి నుంచి లాస్యకు, ఆమె కుటుంబానికి బాగా దగ్గరివాడు. సాయన్న చనిపోయిన తర్వాత.. లాస్యకు ఆకాష్ మరింత దగ్గరయ్యాడు. ఇటీవలే కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ కూడా అయ్యాడు. 35ఏళ్ల లాస్య పాలిటిక్స్‌లోకి వచ్చాక.. ఆకాష్ ప్రతిక్షణం ఆమెకు వెన్నంటే ఉంటున్నాడు. ఒకరకంగా పీఏగా, అంగరక్షకుడిగా ఆకాష్ వ్యవహరిస్తున్నాడు. వీళ్లిద్దరు కలిసి తిరగడం, కారులో వీళ్లిద్దరు కలిసి వెళ్లడం చాలా కామన్. ఐతే లాస్య తల్లికి, సోదరికి ఆకాష్ అంటే పడదు. కానీ ఎమ్మెల్యేగా ఉన్న కూతురుకు ఎదురు చెప్పలేక వాళ్లు మౌనంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత లాస్య వ్యవహారాలు పూర్తిగా తానే చూడడం మొదలుపెట్టాడు ఆకాష్. ఒక రకంగా పర్సనల్ సెక్రటరీగా అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నాడు. యాక్సిడెంట్ అయిన తర్వాత అందరూ డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడని.. లాస్య బ్యాక్ సీట్లో ఉందని రకరకాలుగా చెప్పారు. కానీ ప్రమాదం జరిగిన కారు మోడల్ మారుతి ఎల్ఎక్స్. ఎమ్మెల్యే స్థాయి వాళ్లు తిరిగే కారు కాదిది.
YS JAGAN HELICOPTERS: జనం సొమ్ముతో సోకులు.. 4 కోట్లతో రెండు హెలికాప్టర్లు.. జగన్‌పై ఈసీకి కంప్లయింట్
డ్రైవర్ కారు నడపడం లేదు. ఆకాష్ కారు నడుపుతున్నాడు. ఆయన పక్క సీట్లోనే లాస్య ఉందని తర్వాత తెలిసింది. ప్రమాదం జరిగిన రోజు కుటుంబం అంతా సంగారెడ్డిలోని దర్గాకి వెళ్లింది. ఈ నెల 13న నల్గొండలో కేసీఆర్ పెట్టిన మీటింగ్‌కి లాస్య స్కార్పియో వాహనంలో వెళ్లింది. తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగి హోంగార్డు కూడా చనిపోయాడు. లాస్య బాగా అప్‌సెట్ అయింది. అంతకుముందే నెల కింద ఒక లిఫ్ట్ ప్రమాదం నుంచి కూడా తప్పించుకుంది. అందుకే కుటుంబం అంతా దర్గాకి వెళ్లి వచ్చారు. అక్కడి నుంచి లాస్య, ఆకాష్.. రాత్రి పన్నెండున్నరకు కుటుంబ సభ్యులతో విడిపోయారు. ప్రమాదం ఉదయం ఐదున్నరకు జరిగింది. ఈ ఐదు గంటలు లాస్య ఆకాష్ ఏం చేశారు.. ఎక్కడున్నారన్నది ఆకాష్ చెప్తే కానీ తెలియదు. ఓఆర్ఆర్‌పైన ఎంత నైట్ రైడ్ చేసినా.. రెండు గంటల కన్నా ఎక్కువ తిరగలేరు. రాత్రంతా నిద్ర లేకపోవడంతో ఆకాష్ కారు డ్రైవ్ చేస్తూ నిద్రలో లెఫ్ట్‌కి తిప్పేశాడు.
అంతే వేగంతో కారు వెళ్లి.. ఎడమ వైపు ఉన్న రెయిలింగ్‌కు తగిలింది. ఆకాష్ సీటు బెల్ట్ పెట్టుకోవడంతో గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం మియాపూర్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదానికి ఆకాశ్ కారణమని.. లాస్య సోదరి కేసు పెట్టింది. అతడు కళ్లు తెరిస్తే కానీ అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలియవు. కాకపోతే ఎమ్మెల్యేలు వాడే పెద్ద వాహనాన్ని వదిలేసి.. డ్రైవర్‌ని వదిలేసి, ఇద్దరు గన్‌మెన్‌లను కూడా పక్కనపెట్టి.. వీళ్లిద్దరే అర్ధరాత్రి ఎక్కడికి వెళ్లారు.. తెల్లవారుజాము వరకు ఏం చేశారు అన్నది ఇప్పటివరకు మిస్టరీగానే ఉంది.