సల్మాన్‌తో తిరిగితే లేపేస్తాం ఎంపీకి బిష్ణోయ్‌ గ్యాంగ్‌ వార్నింగ్‌

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఆగడాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయి. ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌ను టార్గెట్‌ చేసిన లారెన్స్‌ గ్యాంగ్‌.. ఆయనతో సన్నిహితంగా ఉండేవాళ్లను కూడా టార్గెట్‌ చేస్తున్నారు. సల్మాన్‌కు దూరంగా ఉండకపోతే చంపేస్తామంటూ వార్నింగ్‌ ఇస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 28, 2024 | 07:57 PMLast Updated on: Oct 28, 2024 | 7:57 PM

Lawrence Gang Warning To Pappu Yadav

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఆగడాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయి. ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌ను టార్గెట్‌ చేసిన లారెన్స్‌ గ్యాంగ్‌.. ఆయనతో సన్నిహితంగా ఉండేవాళ్లను కూడా టార్గెట్‌ చేస్తున్నారు. సల్మాన్‌కు దూరంగా ఉండకపోతే చంపేస్తామంటూ వార్నింగ్‌ ఇస్తున్నారు. ఇదే క్రమంలో బిహార్‌ ఎంపీ పప్పూ యాద్‌వ్‌కు లారెన్స్‌ గ్యాంగ్‌ వార్నింగ్‌ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా. సినీ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయ నాయకుల్లో కూడా సల్మాన్‌ ఖాన్‌కు చాలా మంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. వాళ్లలో పప్పు యూదవ్‌ కూడా ఒకరు. కృష్ణజింకను వేటాడినందుకు ప్రతీకారంగా సల్మాన్‌ను చంపాలి అనుకుంటున్న లారెన్స్‌ గ్యాంగ్‌.. సల్మాన్‌ సన్నిహితులను ఒక్కొక్కరిగా ఆయనకు దూరం చేసి మానసికంగా దెబ్బతీయాలని చూస్తోంది. మాజీ మంత్రి బాబా సిద్ధికీ మర్డర్‌ కూడా ఈ క్రమంలో జరిగిందే. సిద్ధికీ సల్మాన్‌ఖాన్‌కు చాలా క్లోజ్‌ ఫ్రెండ్‌. దీంతో సల్మాన్‌ను టార్గెట్‌ చేసిన బిష్ణోయ్‌ గ్యాంగ్‌.. సిద్దికీ చంపేశారు.

త్వరలో ఇదే గతి సల్మాన్‌కు కూడా వస్తుందని చెప్పారు. ఇప్పుడు పప్పు యాదవ్‌కు కూడా వార్నింగ్‌ ఇచ్చారు. పప్పు యాదవ్‌ ఫోన్‌కు ఓ ఆడియో మెసేజ్‌ పంపించారు లారెన్స్‌ గ్యాంగ్‌. సల్మాన్‌ ఖాన్‌తో తిరగడం మానుకోకపోతే నిన్ను కూడా చంపేస్తామంటూ వార్నింగ్‌ ఇచ్చారు. పప్పు యాదవ్‌తో మాట్లాడేందుకు లారెన్స్‌ బిష్ణోయ్‌ జైలు నుంచి ప్రయత్నిస్తున్నాడట. గంటకు లక్ష రూపాయలు ఇచ్చి మరీ జైలులో సిగ్నల్స్‌ ఆపేస్తున్నాడట. కానీ లారెన్స్‌ ఎంత ట్రై చేసినా పప్పూ యాదవ్‌ అతని ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో నేరుగా ఆయనకు ఆడియో మెసేజ్‌ పంపించారు లారెన్స్‌ గ్యాంగ్‌. దీంతో ఇప్పుడు పప్పు యాదవ్‌ సేఫ్టీ గురించి బిహార్‌ గవర్నమెంట్‌ టెన్షన్‌ పడుతోంది. లారెన్స్‌ గ్యాంగ్‌కు దేశంలో చాలా నెట్‌వర్స్‌ ఉంది. దేశవ్యాప్తంగా చాలా మంది క్రిమినల్స్‌ లారెన్స్‌ గ్యాంగ్‌ కోసం పని చేస్తున్నారు. కేవలం షార్ప్‌ షూటర్లే వాళ్ల గ్యాంగ్‌లో 700 మంది ఉన్నారంటూ వాళ్లది ఎంత పెద్ద గ్యాంగో అర్థం చేసుకోవచ్చు. అలాంటి గ్యాంగ్‌స్టర్‌ ఇప్పుడు పప్పూయాదవ్‌ను టార్గెట్‌ చేయడంతో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది.