KCR: పరామర్శిస్తున్నారా? పరిహసిస్తున్నారా? కేసీఆర్ సర్జరీ చుట్టూ రాజకీయం..
కేసీఆర్‌ని పరామర్శించడానికి బయట నుంచి జనం వస్తే మిగిలిన వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఔట్ పేషెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఆ మాత్రం కనీస అవగాహన కూడా లేకుండా ముఖ్యమంత్రి మొదలుకొని లీడర్లు, సినిమా వాళ్లు, మీడియా వాళ్ల వరకు కెసిఆర్ పరామర్శలకు లైన్ కట్టారు.
KCR: తుంటి ఎముక విరిగి హైదరాబాద్ యశోద హాస్పిటల్‌లో చేరారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. ఆయనకు సర్జరీ జరిగింది. 8 వారాల బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్ల సూచనతో హాస్పిటల్‌లోనే ఉన్నారాయన. అక్కడి నుంచి మొదలైంది పరామర్శల రాజకీయం. కేసీఆర్ వయసు 70 ఏళ్ళు. సర్జరీ చేయించుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయన చుట్టూ రకరకాల జబ్బులతో వందల మంది వేరే రోగులు ఉన్నారు. కేసీఆర్‌ని పరామర్శించడానికి బయట నుంచి జనం వస్తే మిగిలిన వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఔట్ పేషెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఆ మాత్రం కనీస అవగాహన కూడా లేకుండా ముఖ్యమంత్రి మొదలుకొని లీడర్లు, సినిమా వాళ్లు, మీడియా వాళ్ల వరకు కెసిఆర్ పరామర్శలకు లైన్ కట్టారు.
REVANTH REDDY: మొన్న జీవన్ రెడ్డి.. నిన్న మల్లారెడ్డి.. ఎవరినీ వదలని రేవంత్.. బీఆర్ఎస్‌లో టెన్షన్
కాంగ్రెస్ అధిష్టానం ఆదేశంతో ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితోపాటు మంత్రులు, ఇతర నేతలు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, చివరికి కేఏ పాల్ కూడా కెసిఆర్‌ని పరామర్శించారు. కెసిఆర్‌ని కలవకపోతే ఏదో నేరం చేసినట్లు అవుతుందన్న ఎమోషన్‌తో లీడర్లు యశోద హాస్పిటల్‌పై దండయాత్ర చేశారు. తాను అధికారంలో ఉన్న పదేళ్లు ఎన్నడూ కలవని వాళ్ళని, మొఖం చూడని వాళ్ళని, వాళ్ల కష్టాల్లో పలకరించని వాళ్లని కెసిఆర్ ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద పడుకొని చూడాల్సి వచ్చింది. ఈ పరామర్శల్లో కెసిఆర్‌పై ప్రేమ, ఆవేదన కంటే.. నీకు తిక్క కుదిరిందా..? ఒకప్పుడు ఎలా చెలరేగిపోయావు.. ఇప్పుడు చూడు నీ పరిస్థితి? అధికారం లేదు. ఆరోగ్యం లేదు అని వెక్కిరించినట్టుగా అనిపించింది. మాజీ ముఖ్యమంత్రి తుంటి ఎముక ఆపరేషన్ చేయించుకుంటే ఏదో ప్రాణాపాయం వచ్చినట్లు లీడర్లు, సెలబ్రిటీలు వ్యవహరించిన తీరుతో సామాన్య జనానికి అసహ్యం వేసింది. ఈ పరామర్శల పర్వం మొత్తం పరికించి చూస్తే కెసిఆర్ ని పరామర్శించడం కన్నా దాని పేరుతో పరిహసించారా అని అనుమానం వస్తుంది.
పదేళ్లు అధికారం చలాయించి అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన రెండు రోజులకే కెసిఆర్ ప్రమాదం బారిన పడి హాస్పిటల్‌లో చేరారు. ఆయనకు ప్రాణాపాయం ఏమీ లేదు. అయినా కూడా లీడర్లు పనిగట్టుకుని పరామర్శించి కెసిఆర్‌ని పరిహసించినట్లుగా ఉంది. లీడర్లు, సెలబ్రిటీలు కలవడానికి వస్తుంటే సున్నితంగా వద్దు అని చెప్పాల్సింది పోయి.. కెసిఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఆహ్వానాలు పలికారు. ఓటమి తర్వాత జనంలో కెసిఆర్ విషయంలో సెంటిమెంట్ రగిలించడానికి ఈ పరామర్శలు ఉపయోగపడతాయని, జనంలో కల్వకుంట్ల కుటుంబంపై ఉన్న కసి, కోపం తగ్గిపోతాయని కేటీఆర్, హరీష్ రావు భావించి ఉండొచ్చు. కానీ పరామర్శకి వచ్చిన లీడర్‌లలో ఎక్కువమందిలో ఆవేదన కంటే పైశాచిక ఆనందమే కనిపించింది.
PAWAN KALYAN: ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లొద్దు.. జనసైనికులకు పవన్ కల్యాణ్ పిలుపు
కొందరు కాంగ్రెస్ లీడర్లు మాత్రం ఓడిపోయి ఇంట్లో ఉన్న మనిషికి మనమే సానుభూతి సృష్టిస్తున్నాం.. ఇంత అవసరమా అని కామెంట్లు కూడా చేశారు. జీవితంలో ఎన్నడూ కెసిఆర్ ముఖం చూడని కేఏ పాల్ కూడా దర్జాగా హాస్పిటల్‌లోకి వెళ్లి కెసిఆర్‌తో ముచ్చట్లు చెప్పి వచ్చారు. అదే రోజు సిటీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలల్లో జనాన్ని కూడా కెసిఆర్ పరామర్శ కోసం తరలించారు. మళ్లీ చివరలో ఈ ప్లాన్ వికటిస్తుందనే భయంతో విరమించుకున్నారు. కేసీఆర్ స్వయంగా ఎవరూ హాస్పిటల్‌కి రావద్దంటూ వీడియో స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ ప్రకటన తర్వాత కూడా సెలబ్రిటీలు, లీడర్లు కెసిఆర్‌ని కలిసి.. సానుభూతి చూపించి వెళ్తున్నారు. కష్టకాలంలో ఈ పరామర్శలు కలిసి వస్తాయని కెసిఆర్ కుటుంబ సభ్యులు భావించి ఉండొచ్చు. కానీ వచ్చి పోయిన వాళ్లలో.. ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఎలా ఉన్నాడు..? చూసి పోదామని వచ్చిన వాళ్లే ఎక్కువ. ఈ నిజం కల్వకుంట్ల కుటుంబం గుర్తించిందో లేదో మరి. సామాన్య జనానికి మాత్రం బాగా అర్థమైంది.