సల్మాన్ ను లేపేస్తాం, మళ్ళీ లారెన్స్ గ్యాంగ్ వార్నింగ్
దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు అన్నట్టు ఉంది బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పరిస్థితి. తన స్నేహితుడు బాబా సిద్దిఖీని చంపారనే షాక్ నుంచి ఇంకా సల్మాన్ కోలుకోకముందే వరుస బెదిరింపులు ఈ బాలీవుడ్ స్టార్ హీరోకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు అన్నట్టు ఉంది బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పరిస్థితి. తన స్నేహితుడు బాబా సిద్దిఖీని చంపారనే షాక్ నుంచి ఇంకా సల్మాన్ కోలుకోకముందే వరుస బెదిరింపులు ఈ బాలీవుడ్ స్టార్ హీరోకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏ వైపు నుంచి ఎవరు ఎప్పుడు, ఎలా, ఎటాక్ చేస్తారో అని సల్మాన్ బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నాడు. ప్రభుత్వ వ్యవస్థల్లో, పోలీసుల్లో సల్మాన్ కు మంచి పట్టు ఉన్నా, 60 మంది భద్రతా సిబ్బంది సల్మాన్ ఖాన్ ను కంటికి రెప్పలా కాపాడుతున్నా భయపడుతున్నాడు.
లారెన్స్ గ్యాంగ్ నెట్వర్క్ గురించి సల్మాన్ ఖాన్ కు సిద్దిఖీ మర్డర్ తర్వాత క్లియర్ కట్ పిక్చర్ వచ్చింది. ఎక్కడ దాక్కున్నా తనను వెంటాడి చంపుతారేమో అనే భయంలో సల్మాన్ ఉన్నాడు. లారెన్స్ గ్యాంగ్ కు 700 మంది షార్ప్ షూటర్స్ ఉన్నారు. వారి అందరికి సల్మాన్ టార్గెట్ గానే ఉన్నాడు. ఏప్రిల్ లో ఎటాక్ చేసినప్పుడే సల్మాన్ భయపడి సెక్యూరిటి పెంచుకున్నాడు. ఇప్పుడు బాబా సిద్దిఖీని ఎన్సీపీ ఆఫీస్ లోనే చంపడంతో… బిగ్ బాస్ కు సినిమా షూటింగ్ ల కోసం వెళ్ళడానికి కూడా సల్మాన్ భయపడే పరిస్థితి వచ్చింది.
ఇక తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ కు బెదిరింపు కాల్ వచ్చింది. సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం అంటూ నోయిడా కు చెందిన ఒక యువకుడు వార్నింగ్ ఇచ్చాడు. సల్మాన్ కు బాబా సిద్దిఖీ కుమారుడు ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చాడు. 20 ఏళ్ల యువకుడ్ని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు గుఫ్రాన్ ఖాన్ అని ముంబై పోలీసులు వెల్లడించారు. అతను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన వ్యక్తేనా లేక మరోకరా అనే దానిపై కూడా విచారణ వేగవంతం చెసారు. గుఫ్రాన్ ను అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ రిమాండ్‌కు తరలించారు.
ఇలాగే మరో బెదిరింపు కూడా వచ్చింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, బాంద్రాలోని జీషన్ సిద్ధిక్ కార్యాలయానికి శుక్రవారం సాయంత్రం… సల్మాన్ ఖాన్, జిషణ్ ఇద్దరూ తనకు డబ్బు చెల్లించకపోతే చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. జీషన్ సిద్ధిఖీ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా… ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. దీంతో పోలీసులు బెదిరింపులకు పాల్పడింది మహ్మద్ తయ్యబ్ అని గుర్తించి అరెస్ట్ చేశారు. ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు వచ్చిన బెదిరింపు మెసేజ్ కూడా ఇటీవల సంచలనం అయింది. ముంబై పోలీసులు గతంలో జంషెడ్‌పూర్‌కు చెందిన 24 ఏళ్ల కూరగాయల వ్యాపారి షేక్ హుస్సేన్ షేక్ మౌసిన్‌ను అరెస్టు చేశారు. అతను సల్మాన్ ఖాన్ 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసాడు.