గేమ్ చేంజర్ కు వైఎస్ కు లింక్…? ఆ కలెక్టర్ స్టోరీనే శంకర్ తీసాడా…?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజెర్ సినిమాపై... అంచనాలు పిక్స్ లో ఉన్నాయి. ఏడేళ్ల తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సోలో సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ సినిమా కోసం పిచ్చపిచ్చగా ఎదురుచూస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజెర్ సినిమాపై… అంచనాలు పిక్స్ లో ఉన్నాయి. ఏడేళ్ల తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సోలో సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ సినిమా కోసం పిచ్చపిచ్చగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా అభిమానుల్లో కొత్త జోష్ ఇచ్చింది. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ తో పోలిస్తే ట్రైలర్ వేరే లెవెల్ లో ఉంది అంటూ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ట్రైలర్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలాగే సినిమాటోగ్రఫీ అన్నీ కూడా మెగా ఫాన్స్ ను ఫిదా చేశాయి.
రామ్ చరణ్ లుక్స్ కూడా హైలెట్ కావడంతో సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు ఫ్యాన్స్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ముఖ్యమంత్రిపై చేసే పోరాటాన్ని కథగా తీసుకుని ఈ సినిమాను ప్లాన్ చేసారు. అవినీతి ముఖ్యమంత్రి టార్గెట్గా చేసుకుని ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేస్తున్న యుద్ధం ఎలా ఉండబోతుంది అనేది ఈ సినిమాలో చూపించేందుకు రెడీ అయ్యారు. సినిమాలో ఉన్న డైలాగులు కూడా పొలిటికల్ హీట్ ను భారీగా పెంచాయి. ముఖ్యంగా నువ్వు ఐదేళ్లు మాత్రమే మంత్రివి నేను చనిపోయే వరకు ఐఏఎస్ ఆఫీసర్ అంటూ రాంచరణ్ చెప్పిన డైలాగ్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతుంది.
అయితే ఈ సినిమా వెనుక కారణం వేరే ఉంది అంటున్నాయి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు. 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లారు. అప్పుడు ఒక కలెక్టర్ ను రాజశేఖర్ రెడ్డి అవమానించినట్లు వార్తలు వచ్చాయి. నేను తలుచుకుంటే నీ ప్లేస్ లోకి రాగలను నువ్వు జీవితాంతం కష్టపడినా నా ప్లేస్ లోకి రాలేవు గుర్తుపెట్టుకో అని ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీని స్థాపించారు ఆ కలెక్టర్. ఆయనే లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ. 2006లో ఆయన పార్టీని స్థాపించి కొన్నాళ్లపాటు ప్రజాపోరాటాలు చేసి ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.
2009 ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా కూడా ఆయన ఎన్నికయ్యారు. రాజశేఖర్ రెడ్డి కారణంగానే జయప్రకాష్ నారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన కథనే గేమ్ చేంజర్ సినిమాలో చూపించారని టాక్. ఆయన స్ఫూర్తిగానే ఈ సినిమా వస్తుందని పొలిటికల్ సర్కిల్స్ కూడా అంటున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్స్ కూడా కాస్త అలాగే కనబడుతున్నాయి. చూద్దాం మరి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో.