లిక్కర్ పాలసీ సూపర్ హిట్, 2400 కోట్ల ఆదాయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నూతన లిక్కర్ పాలసీ కోట్లు కురిపిస్తోంది. న్యూ లిక్కర్ పాలసీ ప్రకటించిన తర్వాత ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రానుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 14, 2024 | 10:35 AMLast Updated on: Oct 14, 2024 | 10:35 AM

Liquor Policy Is A Super Hit 2400 Crore Revenue

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నూతన లిక్కర్ పాలసీ కోట్లు కురిపిస్తోంది. న్యూ లిక్కర్ పాలసీ ప్రకటించిన తర్వాత ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రానుంది. మద్యం షాపులకు ఇవాళ జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. షాపు దక్కించుకున్న వారు చెల్లించే తొలి విడత లైసెన్స్ రుసుముతో సుమారు రూ.300 కోట్ల ఆదాయం లభిస్తుంది.

షాపు కేటాయించిన 24 గంటల్లో లైసెన్స్ రుసుము కట్టాల్సి ఉంటుంది. అలాగే వారం రోజులు సరకు కొనుగోలు ద్వారా మరో రూ.300 కోట్లకు పైగా వస్తుంది. ఇప్పటికే ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ. 1797.64 కోట్ల ఆదాయం రాగా మొత్తంగా నూతన పాలసీ ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది.