Liquor Scam: మొన్న 8.. నిన్న 10.. ఇవాళ ? కవిత అరెస్ట్ ఖాయమా ?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మూడోసారి విచారణకు హజరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. 10ఫోన్లు ధ్వసం చేశారన్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు... తాను వాడిన అన్ని ఫోన్లను తీసుకుని ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. ఈ నెల 11న మొదటిసారి లిక్కర్ స్కాం కేసులో అధికారులు కవితను విచారించారు.
ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌లో సుమారు 8గంటలు సాగింది విచారణ. రాత్రైనా కవిత బయటికి రాకపోవడంతో ఆమెను అరెస్ట్ చేశారని అంతా అనుకున్నారు. రాత్రి 8 గంటలకు కవిత బయటికి వచ్చారు. మార్చ్ 19న మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు పంపించారు. తాను హాజరు కాలేనంటూ ఈడీకి లేఖ రాశారు కవిత. సుప్రీంకోర్టులో తన పిటిషన్ విచారణ పూర్తయ్యాకే విచారణకు వస్తానని చెప్పారు. దీంతో 20న విచారణకు రావాలని మరోసారి నోటీసులు పంపించారు ఈడీ అధికారులు.
20న ఏకంగా 10గంటల పాటు కవిత విచారణ జరిగింది. సౌత్ గ్రూప్‌తో ఉన్న సంబంధాల గురించి ప్రశ్నల వర్షం కురిపించారు. అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను విచారించారు. మధ్యలో డాక్టర్లు కూడా రావడంతో కవిత అరెస్ట్ పక్కా అని అంతా అనుకున్నారు. ఈడీ మాత్రం సింపుల్‌గా.. రేపు విచారణకు రండి అని సోమవారం కవితను పంపించేసింది. అయితే మూడోరోజు కవితను ఎన్ని గంటలు విచారిస్తారనేది ఉత్కంఠగా మారింది. మొదట 8గంటలు.. తర్వాత 10 గంటలు.. ఇప్పుడు ఎన్ని గంటలనే చర్చ సాగుతోంది. మూడుసార్లు విచారణకు పంపించారంటే.. అరెస్ట్ ఖాయమా అనే టెన్షన్ బీఆర్‌ఎశ్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. ఆ పది ఫోన్లలో ఏముంది.. ఈడీ ఎలాంటి వివరాలు సేకరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.