Indelible Ink: సిరా చరిత్ర.. ఎన్నికల్లో వాడే సిరాకు ఎంత చరిత్ర ఉందో తెలుసా..?

ఎలక్షన్‌ అనగానే అందరికీ గుర్తొచ్చేది వేలిపైన ఇంక్. ఓటు వేసిన ప్రతీ ఒక్కరూ ఆ ఇంక్‌ చూపిస్తూ సెల్ఫీలు దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. చాలా రోజుల వరకూ ఆ ఇంక్ వేలు మీద నుంచి పోదు. ఆ ఇంక్‌లో వాడే కెమిల్స్‌ వల్లే అది అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2024 | 06:12 PMLast Updated on: Apr 24, 2024 | 6:12 PM

Lok Sabha Polls The Story Of Indelible Ink The Hallmark Of Indian Elections

Indelible Ink: ఇండియా మొత్తం ఇప్పుడు ఎలక్షన్‌ మూడ్‌లో ఉంది. ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్‌లో అడుగు పెట్టేందుకు అన్ని పార్టీల ప్రచారం చేస్తున్నారు. ఎలక్షన్‌ అనగానే అందరికీ గుర్తొచ్చేది వేలిపైన ఇంక్. ఓటు వేసిన ప్రతీ ఒక్కరూ ఆ ఇంక్‌ చూపిస్తూ సెల్ఫీలు దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. చాలా రోజుల వరకూ ఆ ఇంక్ వేలు మీద నుంచి పోదు. ఆ ఇంక్‌లో వాడే కెమిల్స్‌ వల్లే అది అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది.

YS JAGAN: ముగిసిన సిద్ధం యాత్ర.. జగన్‌ కన్నీటి లేఖ..

ఎన్నికల్లో ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకున్నాక మరోసారి దొంగ ఓటు వేయకుండా. రీసైక్లింగ్ అరికట్టడానికి భారతీయ ఎన్నికల సంఘం దీన్ని ప్రవేశపెట్టింది. కర్ణాటకలోని మైసూర్‌లో మైసూర్ పెయింటింగ్స్ అండ్ వార్నీష్‌లో ఈ సిరా తయారవుతుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిరా ఉత్పత్తి అవుతుంది. మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలకు మైసూర్‌లో తయారు అయ్యే సిరానే వాడుతున్నారు. 1937లో అప్పటి మైసూర్ మహారాజు కృష్ణరాజ వడియార్-4 ఈ ఫ్యాక్టరీని స్థాపించారు. స్వతంత్రానికి ముందు వరకు ఈ ఫ్యాక్టరీ రాజు ఆధీనంలో ఉండేది. తరువాత ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. 1962 సార్వత్రిక ఎన్నికల నుంచి మైసూర్ పెయింటింగ్స్ అండ్ వార్నీష్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తున్న సిరానే వినియోగిస్తున్నారు. ఈ సిరా తయారీకి ఉపయోగించే ఫార్ములా చాలా సీక్రెట్‌. ఆ ఫ్యాక్టరీలో పని చేసే డైరెక్టర్లకు కూడా దీని ఫార్ములా తెలియదు.

కానీ ఈ సిరాలో 7 నుంచి 25 శాతం వరకు సిల్వర్ నైట్రేట్ ఉపయోగిస్తారు అందుకే సిరా వెంటనే చెరిగిపోదు. దాదాపు 72 గంటల వరకు సిరా అలాగే ఉంటుంది. అదే చర్మంపై పడితే 76 నుంచి 96 గంటల వరకు ఉంటుంది. అందుకే గోరుతో పాటు చర్మానికి కూడా అంటుకునేలా అధికారులు సిరా వేస్తారు. మనదేశంలో తయారవుతున్న ఈ సిరాకు అంతర్జాతీయంగా కూడా డిమాండ్ ఉంది. ప్రపంచంలో చాలా దేశాలకు ఇండియా నుంచే సిరా ఎగుమతి అవుతుంది. అఫ్గనిస్థాన్, అల్జీరియా, ఇండోనేషియా, పాకిస్తాన్, మలేషియా, మయన్మార్, నేపాల్, పెరు, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, సుడాన్ లాంటి దేశాల్లో మన సిరానే వినియోగిస్తున్నారు.