PAWAN KALYAN: ఇదీ పవన్ రేంజ్.. పవన్ కళ్యాణ్ మద్దతు కోరిన లండన్ మేయర్ అభ్యర్థి..!
లండన్ మేయర్ ఎన్నికల బరిలో ఉన్న భారత సంతతికి చెందిన అభ్యర్థి తరున్ గులాటీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మద్దతు కోరారు. తరుణ్ స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు ఎక్కువగా ఉన్నారట.

PAWAN KALYAN: రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారానికి సెలబ్రిటీల సహాయం కోరడం కామన్. సెలబ్రిటీలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అడ్డుపెట్టుకుని వాళ్ల ఓట్లు వేయించుకోవాలి అని చూస్తుంటారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇది కనిపిస్తుంది. ఇలాగే ఓ వ్యక్తి కూడా తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని.. దానికి మీ మద్దతు కావాలంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చాడు. అయితే ఆ వ్యక్తి పోటీ చేసేది భారత్‌లో కాదు.. ఏకంగా లండన్‌లో. అది కూడా మేయర్ పదవికి.
Pawan Kalyan : పవన్ కల్యాణ్ తప్పుచేశాడా.. ? ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు ..?
లండన్ మేయర్ ఎన్నికల బరిలో ఉన్న భారత సంతతికి చెందిన అభ్యర్థి తరున్ గులాటీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మద్దతు కోరారు. తరుణ్ స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు ఎక్కువగా ఉన్నారట. అందుకే పవన్ కళ్యాణ్ సపోర్ట్ కోసం జనసేన ఆఫీస్‌కు వచ్చార తరుణ్. ఆయన నేపథ్యం విన్న పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో తరుణ్‌కు తన మద్దతు తెలిపారు. ఓ రాజకీయ పార్టీ నడుతుపున్న వ్యక్తిగా.. రాజకీయాల్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తనకు తెలుసన్నారు పవన్.
దేశం కానీ దేశంలో ఏకంగా మేయర్ పదవికి పోటీ పడటం అంటే.. సాహసోపేతమైన చర్య అంటూ చెప్పారు. తన అభిమానులు, జనసేన శ్రేణులు, తెలుగువారు, భారతీయులు తరుణ్ గులాటీ విజయానికి కృషి చేయాలని కోరారు.