మాధవి లత Vs జెసి ప్రభాకర్ రెడ్డి.. తాడిపత్రి వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు..!
కొందరు హీరోయిన్లు సినిమాలు తక్కువగా చేసిన కూడా పేరు ఎక్కువగా తెచ్చుకుంటారు. అందులో మాధవి లత అందరికంటే ముందుంటారు.

కొందరు హీరోయిన్లు సినిమాలు తక్కువగా చేసిన కూడా పేరు ఎక్కువగా తెచ్చుకుంటారు. అందులో మాధవి లత అందరికంటే ముందుంటారు. ఈమె చేసిన సినిమాల కంటే బయట చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కువ. కెరీర్ మొదట్లో వరుస సినిమాలు చేసిన ఈమె.. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల వైపు వెళ్లిపోయింది. అదేంటని అడిగితే తెలుగు అమ్మాయిలకు ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వరు.. ఒకవేళ వచ్చినా కూడా వాళ్లకు కావాల్సింది ఇవ్వాల్సిందే అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. కెరీర్ మొదట్లో నచ్చావులే, స్నేహితుడా లాంటి ఒకటి రెండు సినిమాలు చేసిన ఈమె ఆ తర్వాత పూర్తిగా కెరీర్ మీద ఫోకస్ వదిలేసింది. రాజకీయాల వైపు వెళ్లిపోయింది. బిజెపి పార్టీలో కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత ఇంకో పార్టీకి వెళ్లిపోయింది.. మళ్ళీ ఇప్పుడు బిజెపి లోనే ఉంది మాధవి లత.
తాడిపత్రిలోని జెసి ప్రభాకర్ రెడ్డి తో పాటు ఆయన అనుచరుల మీద మాధవి లత చేసిన కామెంట్స్ ఆమెను చిక్కుల్లో పడేసాయి. ఈ వివాదం డిసెంబర్ 31 న మొదలైంది. తాడిపత్రి మహిళలను కించపరిచేలా మాట్లాడారని మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ ఫిర్యాదు చేశారు. దీంతో మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఏమైందంటే.. తాడిపత్రిలో డిసెంబర్ 31 రాత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన ఈవెంట్‌కి మహిళలు వెళ్లొద్దంటూ మాధవీ లత పిలుపివ్వడంతో ఈ వివాదం మొదలైంది. ఆ పార్టీలో అమ్మాయిలను తీసుకెళ్లి ఏమేం చేస్తారో తెలియదు కాబట్టి.. ఇంట్లో ఉండడమే మంచిది అంటే ఒక వీడియో రిలీజ్ చేసింది మాధవి లత. దీనిపై JC భగ్గుమన్నారు.. మాధవీలతపై అమ్మ ఆలీ బూతులతో విరుచుకుపడ్డారు.
ఈయన కామెంట్స్ మీద మహిళా సమాజం పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో క్షమాపణలు చెప్పాడు. అంతటితో ఆ వివాదం ముగుస్తుందని అంతా అనుకున్నారు కానీ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయిప్పుడు. జెసి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై మాధవి లత సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక ఆ రోజు నుంచీ జరుగుతున్న ఈ యుద్ధం ఇప్పుడు పీక్స్‌కి చేరింది. తాజాగా తాడిపత్రి మహిళలను కించపరిచేలా మాట్లాడారని మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో BNS సెక్షన్ 353 ఆఫ్ 1-B కింద కేసు నమోదు చేశారు. దీంతో మళ్లీ వివాదం మొదటికి వచ్చింది.