BRS: మధ్యప్రదేశ్‌లో బీఆర్ఎస్ ఎంట్రీ.. మొదలైన చేరికలు.. ఢిల్లీపై పోరులో కేసీఆర్ మార్క్ రాజకీయం మొదలైందా ?

బీఆర్ఎస్ కార్యకలాపాలు మధ్యప్రదేశ్‌కు కూడా విస్తరించాయి. ఆ రాష్ట్రానికి చెందిన పలువురు బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 8, 2023 | 09:06 AMLast Updated on: Jun 08, 2023 | 9:06 AM

Madhya Pradesh Leaders Including Ex Mp Mlas From Join Brs

BRS: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్‌గా మార్చి.. ఢిల్లీపై దండయాత్ర ప్రకటించిన కేసీఆర్ క్రమంగా దూకుడు పెంచుతున్నారు. దేశవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో అడుగు పెట్టింది. మహారాష్ట్రలోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మరిన్ని పొరుగు రాష్ట్రాలపైనా పార్టీని విస్తరించడంపై కేసీఆర్ దృష్టి సారించారు.

ఊహించిన దాని కంటే వేగంగా ఏపీ, మహారాష్ట్రల్లో అడుగు పెట్టింది బీఆర్ఎస్. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, పార్థసారథి తదితరులు.. ఏపీ బీఆర్ఎస్‌లో చేరారు. మహారాష్ట్ర రాజకీయాల్లోనూ సంచలనాలను సృష్టిస్తోంది బీఆర్ఎస్. తెలంగాణ-,మహారాష్ట్ర సరిహద్దుల్లోని నాందెడ్‌ సహా కంధార్ లోహా, ఔరంగాబాద్‌లో కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించారు. తన లక్ష్యం ఏమిటో వివరించారు. మహారాష్ట్రలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు.

బీజేపీ, ఎన్సీపీ, సమతా పార్టీతో సహా.. మహారాష్ట్రలో పలు రాజకీయ పార్టీల నుంచి నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌ కండువా కప్పుకొన్నారు. బీఆర్ఎస్ కార్యకలాపాలు మధ్యప్రదేశ్‌కు కూడా విస్తరించాయి. ఆ రాష్ట్రానికి చెందిన పలువురు బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. వ్యాపం కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన డాక్టర్ ఆనంద్ రాయ్ కూడా బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. దేశవ్యాప్తంగా వ్యాపం కుంభకోణం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ పరీక్షలకు సంబంధించిన కుంభకోణం ఇది.

దీన్ని ఆనంద్ రాయ్ బయటపెట్టారు. ఇప్పుడాయన బీఆర్ఎస్‌తో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పది బాణాలు వదిలి.. ఏదో ఒకటి తాకుతుందిలే అని ఎదురుచూడడం వేరు. ఒకే బాణాన్ని పక్కాగా గురి చూసి కొట్టడం వేరు. ఇప్పుడు కేసీఆర్ చేస్తోంది అదే. ఆయన మౌనం వెనక కూడా వ్యూహం ఉంటుందని మరోసారి మధ్యప్రదేశ్ చేరికలతో ప్రూవ్ అయింది. ఎన్నికలు జరగబోయే ఒక్కో ప్రాంతంలో పార్టీ విస్తరించి దేశవ్యాప్తంగా సత్తా చాటాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. పిక్చర్ అభీ బాకీ హై దోస్త్ అంటున్నారు గులాబీ పార్టీ నేతలు.