మహా క్రతువు ముగిసింది…!
45 రోజులు.. 66 కోట్ల మంది భక్తుల హాజరు.. 6 రాజస్నానాలతో కుంభమేళా పరిసమాప్తి అయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భక్తులు కుంభమేళాకు పోటెత్తారు. ఈసారి విదేశీయులు కూడా భారీగా తరలివచ్చారు.

**EDS: RPT WITH ADDED POST PRODUCTION** Prayagraj: A drone shot of devotees gathered to take a holy dip during ongoing Mahakumbh Mela, at the Sangam in Prayagraj, Tuesday, Feb. 18, 2025. (PTI Photo) (PTI02_18_2025_RPT021A)
45 రోజులు.. 66 కోట్ల మంది భక్తుల హాజరు.. 6 రాజస్నానాలతో కుంభమేళా పరిసమాప్తి అయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భక్తులు కుంభమేళాకు పోటెత్తారు. ఈసారి విదేశీయులు కూడా భారీగా తరలివచ్చారు. వీఐపీలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. నాగసాధువులు, అఖాడాల రాకతో త్రివేణి సంగంమం దగ్గర ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. జీవితకాల అనుభవాలు మూటగట్టుకున్న భక్తులు సంతృప్తిగా తిరుగుముఖం పట్టారు.ప్రయాగ్ రాజ్ లో 45 రోజులుగా అత్యంత వైభవోపేతంగా, ఆశేష భక్త జనవాహినితో జరిగిన మహా కుంభమేళా ముగిసింది. ఈ మహాకుంభమేళా ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకే కాకుండా.. అంచనాలకు అందని వ్యాపార సామ్రాజ్యంగా కూడా చెప్పుకోవచ్చు.
కుంభమేళా ముగిసే సరికి పుణ్యస్నానాలు చేసినవారి సంఖ్య 66 కోట్లకు పైగా ఉందని అంచనా. గంగ,యమునా,సరస్వతి నదుల పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు అచరించడానికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలి వచ్చారు. ఇంతటి మహత్తర ఆధ్మాత్మిక పండుగ మళ్లీ 144 ఏళ్ల తరువాత గానీ రాదు. దీంతో జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మౌని అమావాస్య రోజు న అంచనాలకు మించి భక్త జనం పోటెత్తడంతో దురదృష్ట వశాత్తూ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 30 మంది చనిపోయారు. రెండు మూడు సార్లు టెంట్లలో అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఈ చిన్నచిన్న అపశ్రుతులు వినా మహాకుంభమేళా సజావుగా జరిగింది.
దేశ జనాభా 145 కోట్లు. వీరిలో 110 కోట్ల మంది హిందువులు. మహాకుంభ్ ముగిసే సరికి 66 కోట్లమంది పైగా పుణ్య స్నానాలు ఆచరించారంటే.. దాదాపు దేశంలోని హిందువులలో దాదాపు సగం మందికి పైగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహా కుంభమేళాకు గతంలో ఎప్పుడూ లేనంతగా ఆదరణ లభించింది. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం అనేక మంది ప్రముఖులు కుంభమేళాకు వచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించి.. ఆపై అనేక ఆలయాలను దర్శించుకున్నారు. జనవరి 13 న ఈ కుంభమేళా ప్రారంభం కాగా 45 రోజుల పాటు జరిగిన ఈ మా ప్రభువుకు కేవలం 45 కోట్ల మంది భక్తులు మాత్రమే వచ్చే అవకాశం ఉందని అధికారులు ముందుగా భావించారు. కానీ రోజుకు కోటికి పైగా భక్తులు వచ్చి యూపీ సర్కారుకు షాక్ ఇచ్చారు. ఇక పండుగల రోజు మరింత ఎక్కువ మంది వచ్చారు. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పూర్ణిమ వంటి రోజుల్లో కోట్లలో భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు.
మహా కుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి వస్తుంది కావున.. జీవితంలో ఒక్కసారైనా చూడాలనే ఆకాంక్షతో భక్తులు మరింత ఆసక్తి చూపారు.
నెల రోజుల పాటు ప్రయాగ్ రాజ్ లో సందడి చేసిన నాగ సాధువులు.. అఖాడాలు.. సన్యాసులు అందరూ మళ్లీ హిమాలయాల బాట పట్టారు. శివుని అనుచరులుగా భావిస్తున్న శైవ అఖాడాలు.. కమండలాలు, త్రిశూలాలు.. రుద్రాక్షమాలలతో పాటు ఆధ్యాత్మిక సాధనకు.. తపస్సు చేసుకునేందుకు కావలసిన కొద్దిపాటి వస్తువులను తీసుకొని వెళ్లిపోయారు.కుంభమేళాలో నాగసాధువుల సమావేశాలు.. వారి పూజా కార్యక్రమాలు లక్షలాది మందిని ఆకర్షించాయి. కొందరు అఖాడాలు వసంత పంచమి నాడు రాజస్నానం ముగియగానే తిరుగుముఖం పట్టారు. కుంభమేళా నుంచి తిరుగు ప్రయాణానికి సూచికగా అఖాడాల ధర్మ ధ్వజాలను అవనతం చేశారు. సంప్రదాయద్మైన కడీ పకోడా విందుతో సాధువులు తమ స్థావరాలకు తిరుగుపనంఅయ్యారు.
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభమేళా ప్రారంభమైంది. భూమి పైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం . దేవతలు రాక్షసులు మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగే సమయంలో నాలుగు అమృత చుక్కలు భూమిపై ఉన్న నాసిక్ , హరిద్వార్ , ప్రయోగ్రాజ్ , ఉజ్జయిని లో పడతాయి. అందు వల్ల ఈ ప్రదేశాలలో కుంభ మేళాను చేస్తారు. ఈ సమయంలో అక్కడ స్నానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతారు. కుంభమేళా సమయంలో దేవుళ్లు సరాసరి భూమి మీదకు వచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. గుప్తుల కాలంలోనూ కుంభమేళా నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది.
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో మహాకుంభమేళా ప్రారంభమవుతుంది. భూమిపై ఏడాది కాలం అంటే దేవతలకు ఒక రోజుతో సమానం. దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపై అది 144 సంవత్సరాలతో సమానం. అంటే మహాకుంభ మేళాలో ఆఖరి రాజస్నానం మిస్ అయితే మళ్లీ 144 సంవత్సరాలకే ఛాన్స్ ఉంటుంది. ప్రతి మూడు తరాల్లో ఒక్కరికి మాత్రమే ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశం దక్కుతుంది. మహా కుంభమేళాకు 850 ఏళ్ల చరిత్ర ఉందంటారు. ఆదిశంకరాచార్యులు దీనిని ప్రారంభించినట్లు చరిత్రకారులు పేర్కొంటారు. గడిచిన 50 ఏళ్లలో దేశం మొత్తం కనెక్ట్ అయిన ఆధ్యాత్మిక కార్యక్రమంగా కుంభమేళా చరిత్ర సృష్టించింది. ప్రతి ఇంట్లోనూ దీని గురించి చర్చ జరిగింది. ప్రతి హిందువులోనూ కుంభమేళాకు వెళ్లాలనే తాపత్రయం కనిపించింది. ఇక్కడ ఎన్నికోట్ల మంది వచ్చారనే లెక్క కంటే.. కుంభమేళా హిందువుల్ని ఏకం చేసిన తీరు నభూతో నభవిష్యతి అనడంలో సందేహం లేదు.